బిగ్‌బ్రేకింగ్‌: దిశ నిందితుల‌ ఎన్‌కౌంట‌ర్‌..!

By Newsmeter.Network  Published on  6 Dec 2019 2:39 AM GMT
బిగ్‌బ్రేకింగ్‌: దిశ నిందితుల‌ ఎన్‌కౌంట‌ర్‌..!

‘దిశ’ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు. కోర్టు అనుమతితో నిందితులను గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Disha Murder Case

ఈ రోజు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో విచారణ నిమిత్తం వైద్యురాలిని హత్య చేసిన ప్రాంతానికి నిందితులను తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా... వారు పారిపోయేందుకు ప్రయత్నిం చేయడంతో పాటు, పాటు పోలీసులపై రాళ్లు రువ్వేందుకు యత్నించారని తెలుస్తోంది. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడుఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు వారి ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. కాగా, దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.

Next Story
Share it