న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 6 Jun 2020 7:39 PM ISTఏనుగు ఘటన తర్వాత మరో దారుణం: గర్భంతో ఉన్న ఆవు నోట్లో బాంబు పెట్టి..
కేరళలోని పాలక్కడ్ జిల్లా మలప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు పేలుడు పదార్థాలతో కూడిన కొబ్బరి కాయ తినడంతో ఏనుగు మరణించిన విషయం తెలిసిందే. ముందుగా ఫైనాపిల్ పిండు అనుకున్నా.. అది కాదు.. కొబ్బరికాయ అని అటవీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏపీలో లాక్‌డౌన్ పొడిగిస్తూ.. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొనసాగుతున్న లాక్ డౌన్‌ను ఈనెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
టీటీడీపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై కేసులు.. హీరో సూర్య తండ్రిపై కూడా..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యురాలు, రచయిత్రి.. టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి తన పదవికి రాజీనామా చేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై టీటీడీ అధికారులు స్పందించారు. ఈ విషయమై ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఆ రోజు నా భార్య అందుకే ఏడ్చింది : రోహిత్ శర్మ
కరోనా మహమ్మారి కారణంగా క్రీడా రంగం కుదేలైంది. పలు టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని రద్దు అయ్యాయి. లాక్‌డౌన్ విధించడంతో భారత్ క్రికెటర్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తమ అనుభవాలను షేర్ చేసుకుంటూ ఉంటున్నారు. తాజాగా భారత క్రికెటర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9న జగన్‌తో టాలీవుడ్ పెద్దల భేటీ.. బాలయ్యకు ఆహ్వానం.. అయితే..
లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమ ఇబ్బందులు, షూటింగ్స్‌ను ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశం పై టాలీవుడ్ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో భేటి కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దీనిపై సినీ నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కొడుకు ముందే భార్యపైన స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం
దేశంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే సమాజం తలదించుకునేలా ఉంది. సొంతవారిపైనే అఘాయిత్యాలు జరుగుతుంటే దేశం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కన్నకూతురుపై, సొంత అక్క, చెల్లులుపై, వృద్ధులపై ఇలా వావి వరుసలు అనేవి లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో అక్షయ్ కుమార్
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫోర్బ్స్ వార్షిక జాబితా విడుదలైంది. ఈ వార్షిక జాబితాలో అత్యధిక పారితోషకం పొందిన 100 మంది ప్రముఖుల్లో భారత్ నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2020 వరకూ దాదాపు రూ.366 కోట్ల సంపాదనతో ఈ బాలీవుడ్ కిలాడీ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
హైదరాబాద్‌లో నాలుగు హత్యలు.. నగరంలో తీవ్ర కలకలం
హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నగరంలో ఒకే రోజు నాలుగు హత్యలు జరిగాయి. రౌడీషీటర్లు కత్తులతో పొడుచుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి మెహదీపట్నం, గోల్కొండలలో ఇద్దరు రౌడీషీటర్లు దాడి చేసుకుని ఇద్దరు మృతి చెందారు. అలాగే ఆలివ్ ఆస్పత్రి సమీపంలో చాంద్ మహ్మద్ ..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పాక్ కోర్టు శనివారం ఇమ్రాన్‌ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు పీఎంఎల్-ఎన్ పార్టీ అధ్యక్షుడు షహ్‌బాజ్ షరీఫ్ 2017లో వేసిన పరువు నష్టం దావా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఈ నోటీసులు అందాయి. ఇమ్రాన్ ఖాన్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ స్నిగల్
కరోనా కారణంగా తెలంగాణలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి