కొడుకు ముందే భార్యపైన స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం

By సుభాష్  Published on  6 Jun 2020 7:46 AM GMT
కొడుకు ముందే భార్యపైన స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం

దేశంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే సమాజం తలదించుకునేలా ఉంది. సొంతవారిపైనే అఘాయిత్యాలు జరుగుతుంటే దేశం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కన్నకూతురుపై, సొంత అక్క, చెల్లులుపై, వృద్ధులపై ఇలా వావి వరుసలు అనేవి లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేరళలో మరో దారుణం చోటు చేసుకుంది. భార్యపైనే స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గపు భర్త. అంతేకాదు ఐదేళ్ల కొడుకు ముందే ఇలాంటి దారుణానికి పాల్పడటం రాష్ట్రంలో సంచనలంగా మారింది. తండ్రి ఈ దారుణానికి పాల్పడుతుంటే కొడుకు అడ్డు రావడంతో కొడుకు అని చూడకుండా తీవ్రంగా చితకబాదాడు ఆ మృగాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి.

విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో అతనితో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. కన్న కొడుకు ముందే ఇలాంటి ఘటనకు పాల్పడటంపై కేరళ రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా కేసును నమోదు చేసింది. ఇది చదవండి: హైదరాబాద్‌లో నాలుగు హత్యలు.. నగరంలో తీవ్ర కలకలం

బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తన నా భర్త మాయ మాటలు చెప్పి తన కొడుకు తోపాటు పుతురురిచ్చి బీచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఆయన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ బలవంతం మద్యం తాగించి, వారు కూడా ఫుల్లుగా మద్యం సేవించి లైంగికంగా వేధించినట్లు పోలీసుల ముందు తెలిపింది. ఇదంతా కూడా ఐదేళ్ల కుమారుడి ముందే జరిగింది. అయితే అత్యాచారం చేసిన తర్వాత ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకుని పరుగెత్తడంతో ఆ మహిళ రోడ్డుపైనే పడిపోయింది. దీంతో మద్యం మత్తులో రోడ్డుపై పడివున్న ఆ మహిళలను గమనించిన ఓ వ్యక్తి తన కారులో తీసుకెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె ముఖంపైకూడా తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు అత్యాచారం సమయంలో ఆమె శరీరంపై సిగరెట్‌తో కాల్చారని బాధితురాలు తెలిపినట్లు పోలీసులు మీడియాకు వివరించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది చదవండి: దారుణం.. భర్త మర్మాంగం కోసేసి..

Next Story
Share it