జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ స్నిగల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2020 12:16 PM GMT
జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ స్నిగల్‌

కరోనా కారణంగా తెలంగాణలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, అందులో పాసైన వారిని కూడా రెగ్యులర్‌గా పాసైనట్లు గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది.

కరోనా పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా కారణంతో ఏ విద్యార్థి అయిన మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీలో కేసలు అత్యధికంగా నమోదు అవుతున్న కారణంగా విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని, పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి, వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ సందర్భంగా తుది తీర్పును వెలువరించింది.

హైకోర్టు తాజా తీర్పుతో పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోనుంది. అంతముందు ఉదయం పదో తరగతి పరీక్షలపై విచారించిన హైకోర్టు పరీక్షలు లేకుండా గ్రేడింగ్‌ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Next Story