న్యూస్‌మీటర్.. టాప్ 10 న్యూస్
By Newsmeter.Network Published on 4 Dec 2019 9:43 PM IST1. మెట్రో కీలక నిర్ణయం!మెట్రో కీలక నిర్ణయం!మెట్రో కీలక నిర్ణయం!
షాద్‌నగర్‌లో జరిగిన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. మహిళల రక్షణ కోసం నిబంధనలు మార్పు చేస్తూ బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా బెంగళూరు మెట్రో చేసిన ఆ ప్రకటన గురించి దేశం అంతా చర్చించుకుంటోంది. మహిళల రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్‌లోకి అనుమతిస్తామని ప్రకటించింది. లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఉన్నతాధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి …
2. రేపు పార్లమెంట్‌కు చిదంబరం..!
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్ పొందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన పార్లమెంట్‌కు వస్తారని చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన 106 రోజుల తర్వాత నేటి సాయంత్రం జైలు నుంచి బయటకు రానున్నారు. చిదంబరం ప్రస్తుతం తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి …
3. ఈ సారి కూడా వారిద్దరి మధ్యే పోటీ.. కానీ కోహ్లీ దాటేశాడు..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత సాధించాడు. తాజాగా.. ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మరోమారు నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకూ అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో.. స్మిత్ 15 రేటింగ్ పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. ఇదే క్రమంలో స్మిత్‌కు 15 పాయింట్ల దూరంలో ఉన్న కోహ్లీ 928 పాయింట్లతో ఆగ్రస్థానానికి ఎగబాకాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి …
4. రాజకీయ కారణాల వల్లే హైదరాబాద్ పై కేంద్రం వివక్ష : కేటీఆర్
హైదరాబాద్ : రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో, కర్నాటక రాజధాని బెంగళూరులో రక్షణరంగ పారిశ్రామిక ఉత్పత్తుల కారిడార్ ని నిర్మించకపోవడాన్ని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తప్పుపట్టారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో రక్షణ రంగ పారిశ్రామిక ఉత్పత్తుల కారిడార్ ని నిర్మించాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కేటీఆర్ గతంలో అభ్యర్థించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి …
5. రాంగోపాల్ వర్మ ‘బ్యూటిఫుల్’ సెన్సార్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడు..?
టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ లేకుండా 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ …త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి …
6. చైనా యుద్ధనౌకను తరిమికొట్టిన భారత్..!
దుందుడుకు చైనా దుస్సాహసాన్ని, దుష్ట పన్నాగాన్ని మన నౌకాదళ వీరులు తిప్పి కొట్టారు. భారత సాగర జలాల్లోకి ప్రవేశించి, గూఢచర్యం నెరపేందుకు ప్రయత్నించిన చైనా యుద్ధ నౌక షి యాన్ 1 ను తరిమి కొట్టారు. మన భద్రత దృష్ట్యా అత్యంత కీలకమైన అండమాన్ నికోబార్ ద్వీప సమూహాలకు చేరువలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ యుద్ధ నౌకను మన ప్రత్యేక ఆర్ధిక క్షేత్ర జలాల నుంచి పంపించి వేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి …
7. అంతర్జాతీయ వేదికపై భారతీయుడి ఘనవిజయం.. సుందర్ పిచాయ్‌కు మరో కీలక బాధ్యత
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు మరో కీలక బాధ్యత అప్పగించారు గూగుల్ వ్యవస్ధాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్. వారి మాతృసంస్థ అల్ఫాబెట్ బాధ్యతల నుంచి తప్పుకుని.. ఆ కంపెనీ బాధ్యతలు కూడా సుందర్ పిచాయ్‌కు అప్పగించారు. ఇక పై ఆల్ఫాబెట్ పరిధిలోని అన్ని సంస్థలకు సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సుధీర్ఘ కాలంగా కంపెనీ వ్యవహారాలు మోసిన మేము.. ఇక ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నామని లారీ పేజ్, సెర్జీ బ్రిన్ ప్రకటించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి …
8. ఆ 17మంది గిరిపుత్రులను బలి తీసుకుంది పోలీసులే..!
మావోయిస్టులను నియంత్రించే కార్యక్రమలో భాగంగా పోలీసులు 17 మందిని కాల్చివేసిన దుర్ఘటన 2012 జూన్ 28 న చత్తీసుగఢ్ లోని సర్కేగూడ ప్రాంతంలో జరిగింది. ఈ దుర్ఘటన పై ఆ సమయంలో పెను దుమారం రేగింది. అయితే అప్పటి ప్రభుత్వం ఈ విషయం పై విచారణకు కమిటీని నియమించినది. విచారణలో అసలు విషయాలు బయటపడ్డయి. అయితే ఎన్‌కౌంటర్ లో చనిపోయింది అమాయక గిరిజనులని తేలింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి …
9. నిజంగానే ‘మూల విరాట్టు’ను ముట్టుకున్నారా..?
యాదాద్రి భువనగిరి: తెలంగాణలోని దివ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని రోజు వేల మంది దర్శించుకుంటారు. భక్తులు తమ కోరికలు నేరవేర్చాలంటూ ఆ యాదాద్రీశుడిని వేడుకుంటారు. అయితే ఆ యాదాద్రిలోని స్వామి వారి స్వయంభూ విగ్రహాన్ని శిల్పులు చెక్కడం, ఆ విగ్రహాంతో సెల్ఫీలు దిగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షనలో సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి …
10. దిశ కేసులో కీలక మలుపు… ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు..!
హైదరాబాద్: దిశ హత్య ఘటన కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితులకు కఠినశిక్ష విధించాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొంది. నిందితులను కఠినంగా తెలంగాణ ప్రభుత్వం కోరింది. నిందితులకు శిక్ష వేయకుండా జాప్యం ఏంటని న్యాయశాఖ కార్యదర్ధి సంతోష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి …