నిజంగానే 'మూల విరాట్టు'ను ముట్టుకున్నారా..?

By అంజి  Published on  4 Dec 2019 8:37 AM GMT
నిజంగానే మూల విరాట్టును ముట్టుకున్నారా..?

ముఖ్యాంశాలు

  • లక్ష్మీనరసింహాస్వామి మూల విరాట్టును చెక్కారని వార్తలు
  • శాంత మూర్తికి బయటకు వచ్చిన కోరలు..!
  • సింధూరం మాత్రమే తీశామంటున్న శిల్పులు

యాదాద్రి భువనగిరి: తెలంగాణలోని దివ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని రోజు వేల మంది దర్శించుకుంటారు. భక్తులు తమ కోరికలు నేరవేర్చాలంటూ ఆ యాదాద్రీశుడిని వేడుకుంటారు. అయితే ఆ యాదాద్రిలోని స్వామి వారి స్వయంభూ విగ్రహాన్ని శిల్పులు చెక్కడం, ఆ విగ్రహాంతో సెల్ఫీలు దిగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్‌ ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు.

చిన్నజీయర్‌ స్వామి పర్యవేక్షనలో సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో యాదగిరి గుట్టను అభివృద్ధి చేస్తున్నారు. యాదగిరి అభివృద్ధిలో భాగంగా శిల్పులు ఆలయంలోని ప్రాకారాలు, గర్భాలయాన్ని, ఇతర మండపాలను రాతితో నిర్మిస్తున్నారు. అయితే రోజులు గడుస్తున్నా ఆలయ నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే శివరాత్రి నాటికి ఆలయ పనులు పూర్తి చేయాలకున్నారు. ఈ నేపథ్యంలో శిల్పులు తమ పనులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో మూలవిరాట్టు కొలువై ఉన్న ప్రదేశంలో కొన్ని నిర్మాణలు చేశారు. ములవిరాట్టు స్వామికి మార్పులు చేసేందుకు సంకల్పించారు.

మూడు నెలల క్రితం ఓ స్తపతిని పిలిపించి స్వయంభూవిగ్రహాన్ని చెక్కమని కోరారని విశ్వసనీయ సమాచారం. అయితే ఆ స్తపతి తాను ఆ విగ్రహాన్ని చెక్కనని, విగ్రహాన్ని తాకితే మహా పాపమని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్కిటెక్‌ బృందం, స్తపతులు కలిసి ఆలయంలో పని చేసే ఓ శిల్పితో ములవిరాట్టును చెక్కించనట్టు తెలుస్తోంద. ములవిరాట్టును చెక్కడం అత్యంత రహాస్యంగా జరిగిన.. ఆ చెక్కిన వారు విగ్రహాంతో సెల్ఫీలు దిగారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై ఆలయ సిబ్బంది, కొందరు స్తపతులు, అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Yadadri 1

అయితే ఆలయ పునర్నిరాణంలో స్తపతి సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వైటీడీఏ మాజీ ప్రధాన స్తపతి సలహాదారు సుందర రాజన్‌ స్పందించారు. ములవిరాట్టును చెక్కలేదని.. 60, 70 ఏళ్లుగా స్వామివారికి పెట్టిన సింధురాన్ని మాత్రమే తొలగించామన్నారు. స్వామి వారిని చెక్కారని వస్తున్న వార్తలు అబద్ధమన్నారు. ప్రధాన అర్చకుల సమక్షంలోని స్వామి వారికి పేరుకుపోయిన సింధురాన్ని గీకివేశామని పేర్కొన్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహా ఆలయాన్ని ఆగమశాస్త్ర ప్రకారం పునర్నిస్తామని, ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భగుడిని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని ముట్టుకోబోమని సీఎం కేసీఆర్‌ 2015 సవంత్సరంలో యాదాద్రి కల్యాణానికి హాజరైన సందర్భంగా వ్యాఖ్యనించారు.

యాదాద్రిలో ములవిరాట్టుకు ప్రతిరోజు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అయితే స్వామి వారిని చెక్కడం పూర్తిగా విరుద్ధమని ఆగమ శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. స్వామి వారి నాలుక బయటకు కనిపించేలా, ఏడు తలల చోట ఐదు తలలు ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి.

Images (2)

పాత గుడి చిత్రం

Next Story