టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ లేకుండా `ఎ` సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ …త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.

Varma 1

రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్నిమలచడం జరిగింది. హీరోహీరోయిన్లు సూరి, నైనా తమ పాత్రలలో ఒదిగిపోయారు. సన్నివేశాలతో పాటు పాటలు హత్తుకుంటాయి ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్ కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. అలాగే చిత్రం కూడా ఆధ్యంతం అలరిస్తుంది అని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.