న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  8 Sep 2020 7:58 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.బ్రేకింగ్‌: సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత

తెలుగు సినిమాల్లో విలక్షణ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన జయప్రకాశ్‌ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోని కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లను నిలిచిపోవడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బిగ్‌బాస్‌ హౌస్‌లో రెండో రోజే మొదలైన రచ్చ..గొడవతో దద్దరిల్లిన హౌస్‌

బిగ్‌బాస్‌ -4 తెలుగు రియాలిటీ షో ప్రారంభమైన విషయం తెలిసిందే. షో ప్రారంభమై రెండు రోజులు కూడా ముగియలేదు అప్పుడు గొడవలు, వివాదాలు, ఎమోషన్స్‌ మొదలయ్యాయి. ప్రతిసారి సీజన్‌ మొదలైన తర్వాత ఏడుపులు, గొడవలు రావడానికి కనీసం పది, పదిహేను రోజులు పట్టేది. కానీ నాలుగో సీజన్‌లో మాత్రం షో ప్రారంభమైన రెండో రోజే మొదలయ్యాయి. తొలివారం ఎలిమినేషన్స్‌ ప్రక్రియ ప్రారంభం కాగా, నామినేషన్స్‌ లో దూషణల పర్వం మొదలైంది. హౌస్‌లో రచ్చ రచ్చ చేసుకున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మూతపడనున్న దేశంలో అతిపెద్ద కోవిడ్‌ సెంటర్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో ప్రత్యేకంగా కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఇక దేశంలో కూడా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక కోవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఇక బెంగళూరులో ఏర్పాటైన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ మూతపడనుంది. 10వేల సామర్థ్యం ఉన్న ఈ కేంద్రాన్ని సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి మూసివేయనున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దొంగబుద్ధి పాకిస్థాన్.. చైనాకు అలా సహాయం చేస్తోందా..?

పాకిస్థాన్ అంటేనే దొంగబుద్ధికి నిదర్శనం.. కుటిలనీతికి కేరాఫ్ అడ్రెస్..! ఎప్పుడు చూసినా భారతదేశానికి వ్యతిరేకంగా కుయుక్తులను పన్నుతూనే ఉంటుంది. భారత్ ను ఎలా దొంగదెబ్బ తీద్దామా అంటూ ఆ దేశ నాయకులు ప్లాన్ ల మీద ప్లాన్ లు వేస్తూనే ఉన్నారు. ఇక భారత్-చైనా దేశాల మధ్య ఏర్పడిన అగాధాన్ని కూడా తనకు ప్లస్ గా మార్చుకోవాలని పాకిస్థాన్ చేస్తున్న చర్యలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.. దొంగబుద్ధి పాకిస్థాన్.. చైనాకు అలా సహాయం చేస్తోందా..?. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నటుడు జయప్రకాశ్‌రెడ్డి సినీరంగ ప్రస్థానం

తెలుగు సినిమాల్లో విలక్షణ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన జయప్రకాశ్‌ రెడ్డి(74) ఈ రోజు కన్నుమూశారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోని కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లను నిలిచిపోవడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తమ హయాంలో అవినీతి జరిగినట్లు టీడీపీ ఒప్పుకుంటోందా.?

హైకోర్టులో తెలుగుదేశంపార్టీ వాదన విచిత్రంగా ఉంది. 2014-19 మధ్య అధికారంలో ఉన్న తమ పార్టీ అనేక విషయాల్లో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేయాలని వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలంటూ టీడీపీ కోర్టులో కేసు వేయటమే విచిత్రంగా ఉంది. టీడీపీ హయాంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు వైసిపి చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమే అంటూ చంద్రబాబునాయుడు మొదలు క్రిందస్ధాయి నేతల వరకు ప్రభుత్వాన్ని పదే పదే సవాలు చేశారు. . పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐపీఎల్ 2020: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి తెలుసుకోండి..!

13వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19, అబుదాబిలో జరగనుండగా.. రెండో మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. సెప్టెంబర్ 20న ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య దుబాయ్ లో రెండో లీగ్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2014 లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పలు మ్యాచ్ లను నిర్వహించారు. కింగ్స్ లెవెన్ పంజాబ్ ఆ స్టేడియంలో ఒకటే ఒక్క మ్యాచ్ ఆడింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలి: సీఎం కేసీఆర్‌

దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు రోజు కొనసాగాయి. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని, తెలంగాణ ముద్దబిడ్డ పీవీ మన ఠీవి అని కొనియాడారు. ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదని అన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేసీఆర్‌ సభలో గుర్తు చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Fact Check : పీఎం కన్యా ఆయూష్ యోజన కింద ఒక్కో బాలికకు 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందా..?

కేంద్ర ప్రభుత్వం ఒక్కో బాలికకు 2000 రూపాయలు ఇవ్వాలని భావిస్తోంది అంటూ ఓ మెసేజీ వైరల్ అవుతోంది. ప్రధాన మంత్రి కన్యా ఆయుష్ యోజన సంక్షేమ పథకం (పిఎం కన్య ఆయుష్ యోజన) కింద బాలికకు 2000 రూపాయలు ఇస్తోందని మెసేజీలో చెప్పుకొచ్చారు. ఈ స్కీమ్ కింద 2000 రూపాయలు ఒక్కో బాలిక అకౌంట్ లోకి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే ట్రాన్స్ఫర్ చేయనుందట..!.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌: పరీక్షలు రాయకుండానే పాస్‌..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలకు హాజరు కాలేకపోయిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులనూ ఉత్తీర్ణులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవలే ఇంటర్‌ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆమోదం తెలుపుతూ అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ శుభవార్త వెలువడితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి చెందిన సుమారు 27 మంది విద్యార్థులకు ఈ మేలు జరగనుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story