తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌: పరీక్షలు రాయకుండానే పాస్‌..!

By సుభాష్  Published on  8 Sep 2020 6:58 AM GMT
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌: పరీక్షలు రాయకుండానే పాస్‌..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలకు హాజరు కాలేకపోయిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులనూ ఉత్తీర్ణులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవలే ఇంటర్‌ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆమోదం తెలుపుతూ అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ శుభవార్త వెలువడితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి చెందిన సుమారు 27 మంది విద్యార్థులకు ఈ మేలు జరగనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో జరిగిన ఇంటర్‌ పరీక్షలకు సుమారు 4.30 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరు కాగా, వారిలో 2,83,462 మంది ఉత్తీర్ణులయ్యారు. కరోనా కారణంగా పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిపే అవకాశం లేకుండా పోవడంతో వాటిని రద్దు చేశారు. పరీక్షలు రాసి తప్పిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులలను పాస్‌ చేస్తున్నట్లు జులై 19వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాదాపు 1.47 లక్షల మంది విద్యార్థులకు పాస్‌ మార్కులు ఇచ్చి ఉత్తీర్ణులను చేశారు.

అలాగే ఫీజులు కట్టి వివిధ కారణాల వల్ల పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులు ఇంకా 27వేల మంది వరకు ఉన్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. వీరందరూ సప్లిమెంటరీ రాయలని అనుకున్నా.. ఇప్పట్లో కుదిరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వారికి కూడా కనీస మార్కులు ఇచ్చి పాస్‌ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీంతో వీరందరు పరీక్ష రాయకుండానే డిగ్రీ చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.

ఇవీ చదవండి

ఆన్‌లైన్‌ డిగ్రీ అడ్మిషన్ల తేదీ పొడిగింపు

తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దు..!

Next Story