తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దు..!

By సుభాష్  Published on  7 Sep 2020 6:18 AM GMT
తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దు..!

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం తయారైంది. ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మినిస్టేషన్‌ యాక్ట్‌ గా చట్టాన్నిఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని వల్ల వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి మరో ముందుడు వేయనుంది. కాగా, వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు ఈ సాయంత్రం 3 గంటల్లోగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అలాగే ఈ రోజే సాయంత్రం 5 గంటల్లోగా రిపోర్టులు పంపాలని ఆదేశించింది. అలాగే వీఆర్వోలను వేరే శాఖల్లో బదిలీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తహసీల్దార్ల నుంచి వీఆర్వోలందరికీ ఆదేశాలు కూడా అందినట్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు. అయితే వీఆర్వోలను ఏ శాఖకు బదిలీ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

కాగా, తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో ఎక్కువగా రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ శాఖకు పలుమార్లు సీఎం కేసీఆర్‌ హెచ్చరికలు కూడా జారీ చేశారు. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల్లో పేరుకుపోయిన అవినీతి ఆ వ్యవస్థకే చెడ్డపేరు తీసుకువస్తుందని కేసీఆరే గత ఏడాది అసెంబ్లీ సాక్షిగా బహిరంగంగా వ్యాఖ్యనించారు. ఈ క్రమంలో రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రామ వ్యవస్థను రద్దు చేయడమే ఏకైక మార్గమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అయితే రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేసీఆర్‌ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ శాఖలో భారీ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కొందరు అధికారులు కోట్ల రూపాయల్లో లంచాలు తీసుకుంటూ పట్టబడటం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు... ముఖ్యంగా ఈ శాఖలో భారీ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి... తాజాగా కొందరు అధికారులు కోట్ల రూపాయాల్లో లంచాలు తీసుకుంటూ పట్టుబట్టడం చర్చగా మారింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సర్కార్‌ కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.

చట్టం తీసుకురావాలా..? కోడ్‌ తీసుకురావాలా..?

ముందుగా చట్టంగా తీసుకురావాలా..లేక రెవెన్యూ కోడ్‌గా తీసుకురావాలా అనే అంశంపై కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరిగింది. అయితే చట్టం చేయడానికి అసెంబ్లీ ఆమోదం ఉంటే సరిపోతుంది. కానీ రెవెన్యూ కోడ్‌కు మాత్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి కావడంతో చట్టానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. రెవెన్యూ శాఖలో మార్పుపై కొన్నాళ్లుగా సభల్లో, అసెంబ్లీలో తరచూ మాట్లాడిన కేసీఆర్‌.. మొదట్లో రెవెన్యూ కోడ్‌ను తీసుకురావాలని భావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు 1999లో ఇలాంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఉన్న 191 చట్టాలను ఒక చోట చర్చి ఏపీ భూమి రెవెన్యూ కోడ్‌-1999 పేరుతో రూపొందించారు. ఇందులో 17 భాగాలు, 47 అధ్యయనాలు, 260 సెక్షన్లను పొందుపర్చారు. అయితే అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపగా, కేంద్ర న్యాయ శాఖ 146 ప్రశ్నలతో తిప్పి పంపింది. దీంతో కోడ్‌ అమలు కాలేకపోయింది. ఇప్పుడు కూడా కోడ్‌ తీసుకువచ్చినా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Next Story