దొంగబుద్ధి పాకిస్థాన్.. చైనాకు అలా సహాయం చేస్తోందా..?

By సుభాష్  Published on  8 Sep 2020 4:29 AM GMT
దొంగబుద్ధి పాకిస్థాన్.. చైనాకు అలా సహాయం చేస్తోందా..?

పాకిస్థాన్ అంటేనే దొంగబుద్ధికి నిదర్శనం.. కుటిలనీతికి కేరాఫ్ అడ్రెస్..! ఎప్పుడు చూసినా భారతదేశానికి వ్యతిరేకంగా కుయుక్తులను పన్నుతూనే ఉంటుంది. భారత్ ను ఎలా దొంగదెబ్బ తీద్దామా అంటూ ఆ దేశ నాయకులు ప్లాన్ ల మీద ప్లాన్ లు వేస్తూనే ఉన్నారు. ఇక భారత్-చైనా దేశాల మధ్య ఏర్పడిన అగాధాన్ని కూడా తనకు ప్లస్ గా మార్చుకోవాలని పాకిస్థాన్ చేస్తున్న చర్యలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.

తాజాగా అమెరికా రక్షణ శాఖ సంచలన విషయాన్ని బయటపెట్టింది. పాకిస్థాన్ ను సైనిక స్థావరంగా చైనా వాడుకుంటోందని తమ నివేదిక ద్వారా బయటపెట్టింది. ఏదైనా దేశంతో చిన్న పాటి ఘర్షణ వాతావరణం తలెత్తినా చైనా పాకిస్థాన్ లో తమ దేశానికి చెందిన విమానాలను మోహరించేలా ప్రణాళికలను రచిస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కోసం అనేక దేశాలను స్థావరాలుగా వాడుకునే ప్రయత్నాలు చేస్తోందని, అలాంటి దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందట..! మయన్మార్, థాయ్ లాండ్, సింగపూర్, ఇండోనేషియా, పాకిస్థాన్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెన్యా, సీషెల్స్, టాంజానియా, అంగోలా, తజికిస్థాన్ దేశాల్లో స్థావరాల అభివృద్ధిపై చైనా కన్నేసినట్లు తెలుస్తోంది. వన్ బెల్ట్ వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టులో భాగంగా పాకిస్థాన్ లో పైప్ లైన్లు, పోర్టు నిర్మాణంతో చైనా తన పట్టు మరింత పెంచుకుంటోంది. మలక్కా జలసంధి మార్గాల ద్వారా ఇంధన వనరుల రవాణాలో అడ్డంకులు లేకుండా చైనా తన ప్లాన్ ను సమర్థవంతంగా పూర్తి చేసింది.

సుదూర విదేశీ ప్రాంతాల్లోనూ తన సైన్యానికి స్థిరమైన వసతులు ఏర్పాటు చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది. ఆఫ్రికా దేశం జిబూటీలోని ప్రస్తుత స్థావరం మాత్రమే కాకుండా మరికొన్ని దేశాల్లోనూ అదనపు సైనిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని చైనా తాపత్రయం. పదాతి, నావికా, వాయుసేనలకు ఇలా సైనిక వసతులను ఏర్పాటు చేయడం ద్వారా యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో స్ట్రాటజికల్ గా ముందుకు పోడానికి సహాయపడుతుందని భావిస్తూ ఉన్నారు. అలాగే చైనాకు చెందిన స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్సెస్ (ఎస్ఎస్ఎఫ్) నమీబియా, పాకిస్థాన్, అర్జెంటీనా వంటి దేశాల్లో ట్రాకింగ్, టెలీమెట్రీ, కమాండ్ స్టేషన్లను కూడా నిర్వహిస్తోంది.

Next Story