బిగ్‌బాస్ హౌస్‌లో రెండో రోజే మొదలైన రచ్చ..గొడవతో దద్దరిల్లిన హౌస్
By సుభాష్ Published on 8 Sep 2020 4:02 AM GMTబిగ్‌బాస్ -4 తెలుగు రియాలిటీ షో ప్రారంభమైన విషయం తెలిసిందే. షో ప్రారంభమై రెండు రోజులు కూడా ముగియలేదు అప్పుడు గొడవలు, వివాదాలు, ఎమోషన్స్ మొదలయ్యాయి. ప్రతిసారి సీజన్ మొదలైన తర్వాత ఏడుపులు, గొడవలు రావడానికి కనీసం పది, పదిహేను రోజులు పట్టేది. కానీ నాలుగో సీజన్‌లో మాత్రం షో ప్రారంభమైన రెండో రోజే మొదలయ్యాయి. తొలివారం ఎలిమినేషన్స్ ప్రక్రియ ప్రారంభం కాగా, నామినేషన్స్ లో దూషణల పర్వం మొదలైంది. హౌస్‌లో రచ్చ రచ్చ చేసుకున్నారు. ఏకంగా తమను తాము కొట్టుకునే వరకు వెళ్లిపోయింది. అనంతరం ఏడుపులు, పెడబొబ్బలు..ఇక మిగిలిన కంటెస్టెంట్లు అందరూ ఓదార్చడం జరిగింది.
రెండో రోజు ఎపిసోడ్‌లో కరాలే కళ్యాణితో జోర్దాన్ సుజాత వైరం మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఇద్దరు గొడవ పడటాన్ని హైటెట్ చేశాడు బిగ్‌బాస్. హౌస్‌లో వంట వంటే విషయం, ఇతర విషయాలలో కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాత మధ్య గొడవ జరిగింది. జోర్దార్ సుజాత ఎంత తగ్గినా గొడవ సద్దుమణగలేదు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావంటూ కళ్యాణి సుజాతో వాదిస్తూ ఏడ్చేసింది.
మరో వైపు సుజాత మాత్రం తను చెప్పేది వినకుండా కళ్యాణి సీన్ చేస్తుందంటూ చెబుతోంది. అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది బిగ్‌బాస్ రెండో ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. కానీ ఈ నాలుగో సీజన్‌లో బిగ్‌బాస్ గొడవలకు ఎక్కువ సమయం ఇవ్వలేదు.. రెండో రోజే నిప్పు పెట్టేలా చేశాడు. కరాటే కళ్యాణి చేసిన రాద్దాంతంతో ఈమె ఎప్పుడు బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతుందిరా బాబు అనే విధంగా చిరాకు పుట్టించింది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో.