13వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19, అబుదాబిలో జరగనుండగా.. రెండో మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. సెప్టెంబర్ 20న ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల మధ్య దుబాయ్ లో రెండో లీగ్ మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ 2014 లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పలు మ్యాచ్ లను నిర్వహించారు. కింగ్స్ లెవెన్ పంజాబ్ ఆ స్టేడియంలో ఒకటే ఒక్క మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అయిదు వికెట్ల తేడాతో ఓడించింది. ఢిల్లీ జట్టు రెండు మ్యాచ్ లు అడగా ఒకటి గెలిచింది.. మరొక మ్యాచ్ లో ఓడిపోయింది.

గత 11 సంవత్సరాలుగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 62 టీ20 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చింది. షేక్ జాయేద్ స్టేడియంలా కాకుండా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అటు స్పిన్నర్లకు, బ్యాట్స్మెన్ లకు కూడా సహకరిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 200కు పైగా పరుగులు చేసిన సందర్భాలు ఉన్నాయి.

బీసీసీఐ ఐపీఎల్ 2020 లీగ్ మ్యాచ్ ల షెడ్యూల్ ను వదిలింది. 24 మ్యాచ్ లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. నాలుగు మ్యాచ్ లు అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో విపరీతమైన వేడి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టనుంది.

ఈ స్టేడియంలో 25000 మంది వీక్షకులు చూసే అవకాశం ఉంది. కరోనా సమయాల్లో అభిమానులను రాణిస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఈ స్టేడియంలో 150-155 పరుగులు చేస్తే విజయానికి మంచి అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు ఎండ్స్ ఉన్నాయి. ఎమిరేట్స్ రోడ్ ఎండ్ ఒకటి.. దుబాయ్ స్పోర్ట్స్ సిటీ ఎండ్ మరొకటి. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో భాగమైన ఈ స్టేడియంలో ప్రత్యేకమైన ఫ్లడ్ లైట్ సిస్టమ్ ఉంది. దీన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని అంటారు. 2018 ఆసియా కప్ ఫైనల్ ను ఈ స్టేడియంలోనే నిర్వహించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *