న్యూస్ మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 30 July 2020 2:14 PM GMTతెలంగాణలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటి వరకు పది లక్షలకుపైగా ప్రజలు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏపీలో కొత్తగా మరో 10,167 పాజిటివ్ కేసులు.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?
ఏపీలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 70,068 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,167 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,557కి చేరింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మమ్మల్ని కాపాడండి : జీజీహెచ్‌లో తల్లి ఆవేదన
గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రెండు నెలల బాలుడు, తల్లి కరోనాతో మూడు రోజుల క్రితం జీజీహెచ్‌లో చేరారు. అయితే.. మూడు రోజులుగా వైద్యులు, సిబ్బంది తల్లి, బిడ్డను పట్టించుకోలేదు. దీంతో.. మమ్మల్ని వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని తల్లి సెల్పీ వీడియోలో అవేదన వ్యక్తం చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
హైదరాబాద్‌లో కరోనా పరీక్ష కేంద్రాల వివరాలు ఇవే..!
తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. కరోనా పరీక్షల సంఖ్య పెంచడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను పెంచింది తెలంగాణ సర్కార్. అయితే కరోనా పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక తికమక పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పరీక్షలు నిర్వహించే కేంద్రాల అధికారి జాబితాను .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Fact Check : రామ మందిర నిర్మాణంపై స్పెయిన్ లో అంత సందడి చేశారా..?
రామ మందిర నిర్మాణం కోసం హిందువులు ఎదురుచూస్తూ ఉన్నారు. కోట్లాది మంది కలలకు ప్రతీకగా భారీ రామాలయ నిర్మాణానికి కీలకమైన తొలి అడుగు కొద్ది రోజుల్లో పడనుంది. ఆగస్టు ఐదో తేదీన మధ్యాహ్నం సరిగ్గా 12-15 గంటల 15 సెకన్ల సమయంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. భూమిపూజకు కేవలం 200 మంది మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన డీజిల్ ధర.. లీటర్‌పై రూ.8 తగ్గింపు
కరోనా కట్టడికోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుతూ పోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు సృష్టించాయి. వాహనదారులు బైక్‌లను బయటకు తీయాలంటేనే జంకే పరిస్థితి వచ్చేది. ఇక ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో డీజిల్ ధరలు పెట్రోల్ రేటుకు సమానంగా దూసుకుపోయాయి. ఈ సమయంలోఒక వైపు పెట్రో ఉత్పత్తుల ధరలు వాహనదారులకు చుక్కలు ..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఐపీఎల్‌లో ట్విస్ట్.. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి..?
కరోనా కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్లు గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టోర్నీ కోసం బీసీసీఐ(భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆగస్టు 2న ఐపీఎల్ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కానుంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
బంగారం ధర ఎందుకు పెరుగుతోంది..?
దేశంలో పసిడి పరుగులు పెడుతోంది. ఎలాంటి బ్రేకులు వేయకుండా రయ్యిమంటూ దూసుకెళ్తోంది. బంగారం అభరణాల పట్ల భారతీయులకు ఉన్నంత మోజు, ప్రేమ మరెక్కడా కనిపించదు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. అనాదిగా వస్తూనే ఉంది. గతంలో పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ పరుగులందుకుంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
నటుడు అనిల్ మురళి హఠాన్మరణం..!
మలయాళం నటుడు అనిల్ మురళి మరణించారు. కొచ్చి లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అనిల్ మురళి గురువారం నాడు తుది శ్వాస విడిచారు. లివర్ సంబంధిత వ్యాధులతో ఆయన గత కొద్దిరోజులుగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వయసు 56 సంవత్సరాలు. నాని నటించిన ‘జెండా పై కపిరాజు’ సినిమాలో అనిల్ మురళి కీలక పాత్ర పోషించాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మండ్లా ప్రాంతంలోని జబల్‌పూర్ జాతీయ రహదారి30 పై ఓ పికప్ వాహనం, మిని ట్రక్కు ఢీ కొన్నాయి. పికప్ వాహానంలో ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు మిని ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి