మధ్యప్రదేశ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మండ్లా ప్రాంతంలోని జబల్‌పూర్‌ జాతీయ రహదారి30 పై ఓ పికప్‌ వాహనం, మిని ట్రక్కు ఢీ కొన్నాయి. పికప్‌ వాహానంలో ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు మిని ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

కాగా.. ఈ ఘటనపై మండ్లా ఎస్పీ మాట్లాడారు. ఈ ఉదయం పికప్‌ వాహానం, మినీ ట్రక్కు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయని.. ఈ ప్రమాదంలో పికప్‌ వాహనంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మిని ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మరణించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.