భార్యను చంపిన తొమ్మిదో భర్త..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2020 9:16 AM GMT
భార్యను చంపిన తొమ్మిదో భర్త..

భార్య ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుందని గమనించిన భర్త ప్రవర్తన మార్చుకోమని పలుమార్లు వారించాడు. అయినప్పటికి భార్య మాట వినకపోవడంతో ఆమెను హత్య చేశాడు. పోలీసుల విచారణంలో దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆ మహిళకు అతను తొమ్మిదో భర్త. అప్పటికే ఆ మహిళ 8 పెళ్లిళ్లు చేసుకుంది.

పహడీషరీప్‌ పీఎస్‌ ఎస్‌ఐ కుమార స్వామి తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపల్‌ పరిధి శ్రీరామకాలనీలో నివాసం ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాటేదాన్‌ పారిశ్రామికవాడలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేసే వరలక్ష్మీ(30)తో పరిచయం అయింది. ఈ క్రమంలో వీరిద్దరి పరిచయం ఏర్పడింది. కాగా.. వరలక్ష్మీకి అప్పటికే భర్త, కుమారుడు ఉన్నాడు.

కాగా.. ఆ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. భర్తను వదిలివేసి నాగరాజును పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు బాగానే ఉన్నా తరువాత వరలక్ష్మీ కొత్త వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం నాగరాజు గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జామున కూడా ఇద్దరి మధ్య మరో సారి గొడవ జరిగింది. ఆవేశానికి లోనైనా నాగరాజు కత్తితో భార్య గొంతు కోసి పరారయ్యాడు. నేరుగా పహాడీషరీప్‌ పీఎస్‌ వద్దకు వచ్చి లొంగిపోయాడు. కాగా.. నాగరాజు తొమ్మిదో భర్త అని, భర్తలతో గొడవ పడి విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటూ వస్తోందని దర్యాప్తులో తేలింది.

Next Story
Share it