ఎస్సార్‌నగర్ సీఐపై నటి శ్రీసుధ ఏసీబీకి ఫిర్యాదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 July 2020 8:26 AM GMT
ఎస్సార్‌నగర్ సీఐపై నటి శ్రీసుధ ఏసీబీకి ఫిర్యాదు

ఎస్సార్ నగర్ సీఐపై నటి శ్రీసుధ ఏసీబీకి ఫిర్యాదు​నగర్ సీఐ మురళీకృష్ణ తన నుంచి లంచం తీసుకున్నారంటూ నటి శ్రీసుధ నాంపల్లిలోని ఏసీబీ అధికారులకు ఈరోజు ఫిర్యాదు చేశారు. సీఐ మురళీకృష్ణ డబ్బులు వసూలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్యామ్‌ కె నాయుడుపై కేసు దర్యాప్తు కోసం డబ్బులు వసూలు చేసినట్లు నటి ఆరోపించారు.

కొద్ది రోజుల క్రితం ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రఫర్ చోటా కె. నాయుడు తమ్ముడు శ్యామ్‌ కె. నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్టు నటి శ్రీసుధ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు కోసం సీఐ మురళీకృష్ణ‌ తన నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త‌గిన‌ ఆధారాలు ఏసీబీ అధికారులకు స‌మ‌ర్పించిన‌ట్టు స‌మాచారం.

Next Story
Share it