టర్కీలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జ‌వాన్ల‌తో వెళ్తున్న‌ బ‌స్సు .. బ్రేకులు ఫెయిల్ కావ‌డంతో ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు జ‌వాన్లు మృతి చెందగా, మ‌రో 27 మంది జ‌వాన్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. బ‌స్సు బ్రేకులు ఫెయిల్ కావ‌డంతో బస్సు బోల్తా పడి ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ట‌ర్కీష్ డిఫెన్స్ మినిస్ట‌ర్ హులుసీ అక‌ర్ తెలిపారు.

ట‌ర్కీలోని మెర్సిన్ ప్రావిన్స్‌లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఒక్క‌సారిగా బ‌స్సు బ్రేకులు ఫెయిల్ కాగా, డ్రైవ‌ర్ బ‌స్సులో ఉన్న‌వారికి స‌మాచారం అందించారు. బ‌స్సును అదుపు చేసే ప్ర‌య‌త్నం చేశాడ‌ని, అయిన‌ప్ప‌టికీ ప్ర‌మాదం జ‌రిగిపోయింద‌ని ఆయన తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కాగా, జాతీయ రక్షణ శాఖ మంత్రి హులుసి అకర్‌, ల్యాండ్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ జనరల్‌ ఎమిట్‌ దందర్‌తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి గాయపడిన సైనికులను పరామర్శించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వారు తెలిపారు. గాయపడిన సైనికులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *