కంటైనర్‌లో ఇరుకున్న కారు.. ఎస్‌బీఐ ఉద్యోగి సజీవ దహనం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2020 5:26 AM GMT
కంటైనర్‌లో ఇరుకున్న కారు.. ఎస్‌బీఐ ఉద్యోగి సజీవ దహనం

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమయ్యారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల టోల్‌ప్లాజా సమీపంలో జరిగింది. కారులో సజీవదహనమైన వ్యక్తిని నంద్యాల మండలం రైతునగరం చెందిన శిశకుమార్‌గా గుర్తించారు. ఇతను నంద్యాల ఎస్‌బీఐ బ్యాంకులో వ‌ర్క్ చేస్తున్నాడు.

ఎస్సై సుధాకర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాలకు చెందిన ఎస్‌బీఐ ఉద్యోగి శివకుమార్‌ మరో ముగ్గురు మిత్రులతో కలిసి హైదరాబాద్‌ నుంచి నంద్యాలకు కారులో బయలుదేరారు. నంద్యాల దగ్గరల్లో ముందుగా వెలుతున్న కంటెనర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. కంటైనర్‌లో కారు ఇరుక్కపోయింది. ఈ విషయాన్ని కంటైనర్‌ డ్రైవర్‌ గమనించకుండా అలాగే 3 కిమీ దూరం ఈడ్చుకెళ్లాడు. నంద్యాల మండలం చాపిరేవుల టోల్‌ప్లాజా వద్ద కారులో మంటలు చెలరేగాయి. శివకుమార్‌(40) దివ్యాంగుడు కావడంతో కారులో నుంచి బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it