బంగారం ధర ఎందుకు పెరుగుతోంది..?

By సుభాష్  Published on  30 July 2020 4:47 AM GMT
బంగారం ధర ఎందుకు పెరుగుతోంది..?

దేశంలో పసిడి పరుగులు పెడుతోంది. ఎలాంటి బ్రేకులు వేయకుండా రయ్యిమంటూ దూసుకెళ్తోంది.

బంగారం అభరణాల పట్ల భారతీయులకు ఉన్నంత మోజు, ప్రేమ మరెక్కడా కనిపించదు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. అనాదిగా వస్తూనే ఉంది.

గతంలో పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ పరుగులందుకుంది. ఏకంగా రూ.55వేలు దాటేసింది. ఇక వెండి కూడా కిలో ధర రూ.6వేలకు చేరుకుంది. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. కానీ బంగారం ధరల విషయంలో మాత్రం షాకిస్తున్నాయి.

అసలు కారణాలేంటి..?

భారత్‌లో శ్రావణమాసంలో పెళ్లిళ్ల సీజన్‌. ఈ సీజన్‌లో బంగారం కొనుగోళ్లు భారీ మొత్తంలో జరుగుతుంటాయి.సీజన్‌ మొదలైనా షాపులు దేశంలో వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ల కారణంగా పూర్తి సమయం తెరుచుకోవడం లేదు. అయితే బంగారం డాలర్‌ మారకం రేట్‌ తో పోటీ పడటం అనాదిగా వస్తోంది. ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు అంతనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాయి.

సామాన్యుడికి షాకిస్తున్న పసిడి

ప్రస్తుతం బంగారం ధర రూ.55వేలపైగా దాటేసింది. వెండి కూడా అందే 66వేలకు చేరుకుంది. శ్రావణ మాసంలోపెళ్లిళ్ల కోసం బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం అంటే భయపడే రోజులు వచ్చేశాయి. ఈ ట్రెండ్‌ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధరలు ఎలా నిర్ణయిస్తారు..?

జ్యులరీ షాపునకు వెళ్లి ఏదైన అభరణం ఎంపిక చేసుకుని బిల్లు అడిగితే అతను ఏవేవో రాసి చీటి చేతిలో పెడతాడు. దానిని గుడ్డిగా నమ్ముతాం. అలా చేయరాదు. నిజానికి సిటీలో అయితే షాపు యజమానులందరికీ కలిపి ఒక సంఘం ఉంటుంది. ఈ సంఘట ప్రతి రోజూ ఉదయం సమావేశమై బిల్లింగ్‌ ధరలను నిర్ణయిస్తాయి.

బిల్లింగ్‌ ఎలా ఉంటుంది..

ఉదారణకు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50వేలు అనుకోండి. అభరణం తయారు చేసినందుకు 10 శాతం చార్జీ వడ్డిస్తారు. అలా అనుకుంటే రూ.5వేలు అవుతుంది. ఈ రెండు కలిపితే రూ.55 వేలు. దీనిపై మూడు శాతం జీఎస్టీ చార్జీ రూ.1650 పడుతుంది. ఇప్పుడు మొత్తం కలిపితే రూ.55,650 అవుతుంది.

బంగారం ధర, అభరణంలో ఉన్న బంగారు శాతం, అందులో ఏ లోహము కలిపాము అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఇదొక్కడే కాదు బంగారం దిగుమతులు, రూపాయి పతనం, బలపడటం, కరెన్సీ మారకం విలువల ప్రభావం తదితర అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతుంది.

ఉదాహరణకు అంతర్జాతీయ మార్కెట్‌ లో రూపాయి మారకం విలువ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. 1డాలర్‌=70 రూపాయలు. ఈ ధరలో రూపాయి విలువ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. ఎందుకంటే మనం బంగారాన్ని డాలర్ల రూపంలో కొనుగోలు చేస్తాం. అదే డాలర్‌ విలువ తగ్గితే బంగారం తగ్గుతుంది. వర్తకులు ఎక్కడ నుంచి బంగారం కొన్నారు, ఎంతకు కొన్నారు లాంటి అంశాలు కూడా ధరను నిర్ణయిస్తాయి. అందుకే షాపుల్లో ధరలు మారిపోతాయి.

బంగారం కొనుగోలు చేసే ముందు గుర్తించుకోవాల్సిన అంశాలు

  • బంగారంలో స్వచ్ఛత ఎంత శాతం ఉంది..? పాత జ్యులరీ మార్పిడికి అవకాశం ఉందా...? ఒక వేళ ఉంటే తరుగు ఎంత తీస్తారు..?వారంటీ ఉందా.., బిల్లులో అన్ని చార్జీలు పేర్కొన్నారా..? లాంటి అంశాలను గుర్తించుకోవాల్సి ఉంటుంది.
  • కొందరు వర్తకులు ఈ రోజు బంగారం ధర ఎంత అనేది షాప్‌ బయట బోర్డు పెడతారు. బంగారం అభరణాలపై 0% తయారీ చార్జీలు అని ప్రకటిస్తారు. అయితే ఈ చార్జీలను తరుగు లేదా మరో రూపంలో విధించే అవకాశం ఉంటుందని గుర్తించుకోవాలి.

Next Story