షాకింగ్‌: పరుగులు పెడుతున్న బంగారం ధర

By సుభాష్  Published on  30 July 2020 4:05 AM GMT
షాకింగ్‌: పరుగులు పెడుతున్న బంగారం ధర

బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భగభగమంటున్నాయి. ఎన్నడు లేని విధంగా పసిడి పరుగులు పెడుతోంది. వరుసగా 9వ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఇక వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది.

తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.50,740కి ఎగబాకింది.

ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు రెక్కలొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రూ.52,700కు చేరగా, అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,500కు చేరింది.

అలాగే పది రోజులుగా వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. 13వేల వరకు పెరిగింది. తాజాగా మార్కెట్లో కిలో వెండి ధర రూ.66,050కి ఎగబాకింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు బంగారం పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story