ఏపీలో కొత్తగా మరో 10,167 పాజిటివ్‌ కేసులు.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2020 12:49 PM GMT
ఏపీలో కొత్తగా మరో 10,167 పాజిటివ్‌ కేసులు.. ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?

ఏపీలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 70,068 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,167 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,30,557కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావరిలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, అనంతపూర్‌లో ఎనిమిది మంది, కర్నూల్‌లో ఎనిమిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, చిత్తూరులో ఆరుగురు, కడపలో ఆరుగురు, ప్రకాశంలో నలుగురు, విజయనగరంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకులంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున 68 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,281 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 60,024 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 69,252 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 954,

చిత్తూరులో 509,

ఈస్ట్‌ గోదావరిలో 1441,

గుంటూరులో 946,

కడపలో 753,

కృష్ణలో 271,

కర్నూలులో 1252,

నెల్లూరులో 702,

ప్రకాశంలో 318,

శ్రీకాకుంలో 586,

విశాఖపట్నంలో 1223,

విజయనగరంలో 214,

పశ్చిమ గోదావరిలో 998 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.Next Story
Share it