న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  26 May 2020 9:00 PM IST
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1. శ్రీకాకుళం: వోల్వో బస్సు బోల్తా.. 40 మంది వలస కూలీలకు గాయాలు

శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మందస మండలం బాలిగాం వద్ద వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది వరకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బ్రేకింగ్: భారీ అగ్నిప్రమాదం.. 1200 ఇళ్లు బుగ్గిపాలు.. ఘటన స్థలానికి 30

రింజన్లు ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్థరాత్రి తుగ్లకాబాద్ మురికివాడలో మంటలు భారీగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 1200 ఇళ్ల అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జబర్దస్త్‌ నటికి వేధింపులు.. అర్ధరాత్రి స్కూటీ ఆపేసి నడి రోడ్డుపై ..

జబర్దస్త్‌ కామెడీ షో.. ఇది ప్రతి ఒక్కరి తెలిసిందే. వారంలో రెండు రోజుల పాటు రాత్రి 9.30 గంటల ఈటీవలో ప్రసారం అవుతుంది. అయితే జబర్దస్త్‌ షో చాలా మందికి లైఫ్‌ ఇచ్చింది. ఎంతో మంది కమెడియన్లకు ఈ షోద్వారా మంచి అవకాశాలే వచ్చాయి. మంచి పోజిషన్‌లో ఉన్నారు. అలాంటి కమెడియన్‌లలో ఒకరైన సాయితేజ అలియాస్‌ ప్రియాంక... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.బిగ్‌బ్రేకింగ్ : టీడీపీకి షాక్‌.. వైసీపీలోకి ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు

సంచ‌ల‌నాల‌కు మారుపేరైన‌ ఏపీ రాజ‌కీయం ఒక్క‌సారిగా హీటెక్కింది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలిగిరి లు.. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి మద్దుతు తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌రో ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార వైసీపీలో చేర‌నున్నారనే వార్త‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆర్‌సీబీ క‌ల నిజ‌మైంది.. స‌న్‌రైజ‌ర్స్‌ను ఓడించి మ‌రీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2008లో ప్రారంభమైంది. ఇప్ప‌టి వ‌ర‌కు 12 సీజ‌న్లు జ‌రుగ‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఆఫ్ బెంగ‌ళూరు ఒక్క సారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను సాధించ‌లేదు. ప్ర‌తి సారీ క‌ప్పు మ‌న‌దే అంటూ అభిమానులు ఆశ‌ప‌డ‌డం చివ‌ర‌కు నిరాశ‌ప‌డ‌డం ష‌రా మాములే. అయిన‌ప్ప‌టికి ఇప్ప‌టికి కూడా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనా కాలర్‌ ట్యూన్‌ వాయిస్‌ ఎవరిదో తెలుసా..? తెలుగు మహిళదే

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్‌ ముచ్చటే. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఏ వైరస్‌ గురించి పెద్దగా చర్చించుకోలేని విధంగా ఇప్పుడు కరోనా వైరస్‌ గురించే చర్చ. అంతేకాదు మనం ఎవరికైనా ఫోన్‌ చేసినా ముందుగా 'కోవిడ్‌-19 జాగ్రత్తలు, చర్యల గురించి ఓ కాలర్‌ ట్యూన్‌ వినిపిస్తుంది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏపీలో పాస్టర్లకు వేతనం.. లెక్కల్లో తేడా అంటున్న ఐవీఆర్

దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని పని జగన్ సర్కారు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చీల్లో పాస్టర్లకు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వడానికి సాహసించింది. ఓవైపు హిందూ దేవాలయాల నుంచి ఆదాయం తీసుకుంటూ అర్చకులను పట్టించుకోకపోవడంపై విమర్శలున్నాయి. అలాంటిది ప్రభుత్వానికి పైసా ఆదాయం తెచ్చిపెట్టని చర్చీల్లో పని ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గుడ్ న్యూస్‌.. ఏపీలో మ‌రిన్ని స‌డ‌లింపులు.. స్ట్రీట్ ఫుడ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

ప్ర‌స్తుతం దేశవ్యాప్త లాక్‌డౌన్ 4 అమ‌లులో ఉంది. కాగా.. లాక్‌డౌన్ 4వ ద‌శ‌లో భారీగా స‌డ‌లింపులు ఇచ్చింది ప్ర‌భుత్వం. తాజాగా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల నుంచి మ‌రి కొన్నింటికి స‌డ‌లింపులు ఇస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. కరోనా కారణంగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలను సాధ్యమైనంత తొందరగా మళ్లీ పట్టాలెక్కించాలని బావిస్తోంది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నెట్టింట సంద‌డి చేస్తున్న‌‌ ఆర్జీవీ ‘క‌రోనా వైర‌స్’ ట్రైల‌ర్

క‌రోనా వైర‌స్ పై తెర‌కెక్కించిన మొద‌టి సినిమా త‌న‌దే అంటున్నాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. క‌రోనా-లాక్‌డౌన్ ప‌రిస్థితుల కార‌ణంగా రెండు నెల‌ల పాటు సినిమా షూటింగ్‌లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికి ఈ క్లిష్ట కాలంలోనూ క‌రోనా వైర‌స్ పేరుతో ఓ ఫీచ‌ర్ ఫిల్మ్ ను వ‌ర్మ పూర్తి చేశాడు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా మ‌రో 71కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 71 కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలంగాణ ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1991 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 57 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 1284 మంది డిశ్చార్జి కాగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story