శ్రీకాకుళం: బస్సు బోల్తా.. 40 మంది వలస కూలీలకు గాయాలు

By సుభాష్  Published on  26 May 2020 3:40 AM GMT
శ్రీకాకుళం: బస్సు బోల్తా.. 40 మంది వలస కూలీలకు గాయాలు

శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మందస మండలం బాలిగాం వద్ద వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది వరకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, పశ్చిమబెంగాల్‌కు చెందిన వలస కూలీలు కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. బస్సు బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తుండగా శ్రీకాకుళం మందన మండలం బాలిగాం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరగగానే బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ పరారయ్యారు.

కాగా, ఇలా డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలో లాక్‌డౌన్‌ ఉన్నన్ని రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రవాణా విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వడంతో వాహనాల రాకపోకలు భారీగానే జరుగుతున్నాయి. దీంతో తగ్గిపోయిన రోడ్డు ప్రమాదాలు మళ్లీ భారీగానే జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోయారు. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చిననాటి నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అధిక సంఖ్యలో వలస కూలీలే మృతి చెందారు. రెక్కాడితే కాని డొక్కాడని వలస కూలీలకు ఇలా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువును వెంటాడుతోంది. అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Next Story