బ్రేకింగ్‌: భారీ అగ్నిప్రమాదం.. 1200 ఇళ్లు బుగ్గిపాలు.. ఘటన స్థలానికి 30 ఫైరింజన్లు

By సుభాష్  Published on  26 May 2020 2:13 AM GMT
బ్రేకింగ్‌: భారీ అగ్నిప్రమాదం.. 1200 ఇళ్లు బుగ్గిపాలు.. ఘటన స్థలానికి 30 ఫైరింజన్లు

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్థరాత్రి తుగ్లకాబాద్‌ మురికివాడలో మంటలు భారీగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 1200 ఇళ్ల అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే 30 అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటన స్థానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

కాగా, అర్ధరాత్రి సమయంలో తుగ్లకాఆబాద్‌లోని మురికి వాడలో అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం అందిందని డీసీపీ రాజంద్రప్రసాద్‌ తెలిపారు. ఇప్పటి వరకూ ఎవరు చనిపోలేదని, అసలు అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయం పూర్తిగా తెలియాల్సి ఉందని తెలిపారు.

అలాగే ఈ నెల 22న ఢిల్లీలోని చునా భట్టి మురికివాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 45 అగ్నిమాపక శకటాలతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. 45 ఫైరింజన్లతో మంటలను అతికష్టం మీద మంటలను అదుపు చేశామన్నారు. ఈ ప్రమాదం కారణంగా మురికి వాడలో చాలా ఇళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు.

అలాగే ఇటీవల కూడా ఢిల్లీలోని మురికివాడలో ఎన్నో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఇటీవల త్రిక్రీ బోర్డర్‌ ఏరియాలో ఓ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఘటన స్థలానికి 30 ఫైరింజన్ల వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఇది ఒక్కటే ఇలా ఎన్నో ప్రమాదాలు సంభవించి భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించిన సందర్భాలున్నాయి. షాట్‌ సర్య్కూట్‌ వల్లనో, ఇతర కారణాల వల్ల ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగి భారీ ఆస్తినష్టం సంభవించింది.

Fire Accident In Tuglakabad1Next Story
Share it