బిగ్‌బ్రేకింగ్ : టీడీపీకి షాక్‌.. వైసీపీలోకి ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 May 2020 8:29 AM GMT
బిగ్‌బ్రేకింగ్ : టీడీపీకి షాక్‌.. వైసీపీలోకి ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు

సంచ‌ల‌నాల‌కు మారుపేరైన‌ ఏపీ రాజ‌కీయం ఒక్క‌సారిగా హీటెక్కింది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలిగిరి లు.. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి మద్దుతు తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌రో ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార వైసీపీలో చేర‌నున్నారనే వార్త‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. రేప‌ల్లే ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్, ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావులు ఈ రోజు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక‌పై వారివురు మంత్రితో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వారు తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైసీపీ కండువా క‌ప్పుకోనున్నార‌ని స‌మాచారం.

ఇక‌.. వారి బాట‌లోనే మ‌రికొంత‌మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా టీడీపీ నుండి అధికార వైసీపీలోకి భారీగా వ‌ల‌స‌లు ఉంటాయ‌నే వార్త‌లు వ‌స్తున్న నేఫ‌థ్యంలో తాజా ప‌రిణామాలు.. ఏపీలో వేస‌వి ఎండ వేడిమిని మించి హీట్ పెంచుతున్నాయి.

Next Story
Share it