'కరోనా కాలర్‌ ట్యూన్‌' వాయిస్‌ ఎవరిదో తెలుసా..? తెలుగు మహిళదే

By సుభాష్  Published on  26 May 2020 2:10 PM GMT
కరోనా కాలర్‌ ట్యూన్‌ వాయిస్‌ ఎవరిదో తెలుసా..? తెలుగు మహిళదే

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్‌ ముచ్చటే. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఏ వైరస్‌ గురించి పెద్దగా చర్చించుకోలేని విధంగా ఇప్పుడు కరోనా వైరస్‌ గురించే చర్చ. అంతేకాదు మనం ఎవరికైనా ఫోన్‌ చేసినా ముందుగా 'కోవిడ్‌-19 జాగ్రత్తలు, చర్యల గురించి ఓ కాలర్‌ ట్యూన్‌ వినిపిస్తుంది. ఆ తర్వాతే మనం ఫోన్‌ చేసి వ్యక్తికి కాల్‌ కలుస్తుంది. ఈ వైరస్‌ వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో పొడి దగ్గుతో కాలర్‌ ట్యూన్‌ ప్రారంభమయ్యేది. మొదట్లో ఎవరికైన ఫోన్‌ చేస్తుంటే

కాలర్‌ ట్యూన్‌ విని ఎంతో మంది షాక్‌కు గురయ్యారు. నిజంగానే అవతలి వ్యక్తి దగ్గుతున్నాడా..? అనే సందేహం కలిగేది. కొందరు ఆ పొడిదగ్గుతో కూడిన కాలర్‌ ట్యూన్‌ను విని భయపడేవారు. ఇటీవల టెలికాం సంస్థలు దగ్గుకు సంబంధించిన ఆడియో భాగాన్ని కట్‌ చేసి ఈ ట్యూన్‌ను చేశారు. మార్చి మొదటి వారం నుంచి ఈ వాయిస్‌ వింటున్నాము. ప్రస్తుతం ఇదే ట్యూన్‌ దాదాపు నిమిషాం పాటు వస్తోంది.

అంతేకాదు ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో తెలుగులో ట్యూన్‌ మారుమోగుతోంది. ఎవరికి ఫోన్‌ చేసిన ముందుగా వచ్చేది ఈ కోవిడ్‌-19 కాలర్‌ ట్యూనే. అయితే అవలి వ్యక్తులకు ఫోన్‌ చేయగానే ఈ ట్యూన్‌ వింటాము తప్ప ఎవరి వాయిస్‌ ఇది అనేది పెద్దగా పట్టించుకోము. ఇంతకీ ఆ వాయిస్‌ ఎవరితో తెలుసా..? సమాజ హితాన్ని కోరుతూ తయారు చేసిన కోవిడ్‌-19 కాలర్‌ ట్యూన్‌ వాయిస్‌ విశాఖకు చెందిన పద్మావతి. తాజాగా ఈ కరోనా ట్యూన్‌ గురించి ఆమె మాట్లాడుతూ.. నాకు కాలర్‌ ట్యూన్‌ను హిందీలో ఇచ్చారు. దానాని నేను తెలుగులోకి అనువదించి ట్యూన్‌ను తయారు చేశాను. ఉన్నది ఉన్నట్లుగానే వాయిస్‌ ఇస్తే అధిక సమయం పడుతుంది. అందుకే భావం మారిపోకుండా కొద్దిగా మార్పులు చేసి 30 సెకన్ల పాటు నిడివి ఉండేలా వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాను... అని పద్మావతి తెలిపారు.

అంతేకాదు కోవిడ్‌-19 గురించి చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడంపై రెండు రకాల కాలర్‌ ట్యూన్‌ ఇచ్చానని, ఒకటి వ్యాధిపై అవగాహన పెంచుకోవడానికి, మరొకటి వైద్యులను, పోలీసులను, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలంటూ మరో కాలర్‌ ట్యూన్‌ ఇచ్చాను అంటూ తెలిపింది. వాయిస్‌ ఇచ్చిన పద్మావతి విశాఖలో డిగ్రీ చేసి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఎంఏ సోషియాలజీ చదివిన పద్మావతి ఓ ప్రైవేటు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త ప్రభాకర్‌ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కాగా, పద్మావతి దాదాపు పదేళ్ల నుంచి వివిధ కార్యక్రమాలకు వాయిస్‌ ఓవర్ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే రేడియో కార్యక్రమాలను సైతం పద్మావతినే వాయిస్‌ ఇస్తున్నారు. దాదాపు 500 ఎపిసోడ్స్‌కు పద్మావతి వాయిస్‌ ఇచ్చారట.

Next Story