కరోనాపై జపాన్ విజయం.. కరోనా నియంత్రణలోకి రావడానికి కారణాలేంటి..!

By సుభాష్  Published on  26 May 2020 6:46 AM GMT
కరోనాపై జపాన్ విజయం.. కరోనా నియంత్రణలోకి రావడానికి కారణాలేంటి..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలన్నింటికి చాపకింద నీరులా వ్యాపించింది. ఇక అగ్రరాజ్యమైన అమెరికాను సైతం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇక అసలు విషయానికొస్తే కరోనాపై జపాన్‌ దేశం విజయం సాధించింది. ఇక్కడ జనవరిలోనే తొలికరోనా కేసు నమోదైంది. ఇక జపాన్‌లో ఎలాంటి లాక్‌డౌన్‌లు లేకుండా రెస్టారెంట్లు, ఇతర షాపులన్నీ తెరిచే ఉన్నాయి. కరోనా పరీక్షల సంఖ్య కూడా తక్కువే. కానీ వెయ్యి లోపే మరణాలు సంభవించాయి. కరోనా వైరస్‌ను ఆ దేశం సమర్ధవంతంగా ఎదుర్కొగలిగింది. సోమవారం నుంచి ఆ దేశంలో అత్యవసర స్థితిని ఎత్తివేసింది.

కరోనా నియంత్రణలోకి రావడానికి కారణాలేంటీ..?

జపాన్‌లో జనవరిలో తొలి కరోనా కేసు నమోదైన వెంటనే అక్కడ ప్రభుత్వం పాఠశాలలు మూసివేసింది. అంతేకాదు జపనీయుల భాష ఉచ్ఛారణ కూఆ అక్కడ కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఒక కారణమని సమాచారం. జపాన్‌లో ఊబకాయుల సంఖ్య తక్కువ. జపాన్‌లోని అందరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. అంతేకాదు బయటకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లటప్పుడు మాస్కులు ధరించడం వారికి అలవాటు. ఈ కారణాలతో జపాన్‌లో కరోనా మరణాలు వెయ్యిలోపే నమోదయ్యాయి.

ఇక రికవరీ శాతం కూడా ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ. వైరస్‌ సోకిన వారి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను గుర్తించేందుకు పలు టెక్నాలజీలను వాడాయి పలు దేశాలు. కానీ జపాన్‌లో అనలాగ్‌ పద్దతిలో కాంటాక్ట్ ట్రేసింగ్‌ చేశాయి. 2018లోనే ఆ దేశం అంటు వ్యాధులపై పని చేసేందుకు పెద్ద సంఖ్యలో నర్సులను నియమించుకుంది. ఒక కరోనా నిర్ధారణ కాగానే, నర్సులు వారి కాంటాక్ట్‌ను గుర్తించి, వారి నుంచి ఇతరులకు వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కారణంగా జపనీయులకు కరోనా వైరస్‌ ప్రభావం పెద్దగా పడలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story