గుడ్ న్యూస్‌.. ఏపీలో మ‌రిన్ని స‌డ‌లింపులు.. స్ట్రీట్ ఫుడ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2020 1:35 PM GMT
గుడ్ న్యూస్‌.. ఏపీలో మ‌రిన్ని స‌డ‌లింపులు.. స్ట్రీట్ ఫుడ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

ప్ర‌స్తుతం దేశవ్యాప్త లాక్‌డౌన్ 4 అమ‌లులో ఉంది. కాగా.. లాక్‌డౌన్ 4వ ద‌శ‌లో భారీగా స‌డ‌లింపులు ఇచ్చింది ప్ర‌భుత్వం. తాజాగా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల నుంచి మ‌రి కొన్నింటికి స‌డ‌లింపులు ఇస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. కరోనా కారణంగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలను సాధ్యమైనంత తొందరగా మళ్లీ పట్టాలెక్కించాలని బావిస్తోంది ఏపీ ప్ర‌భుత్వం.

రాష్ట్రవ్యాప్తంగా నగలు, బట్టలు, చెప్పులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. స్ట్రీట్ ఫుడ్స్‌ కు(పార్సిళ్లకు మాత్రమే) అనుమతి ఇచ్చిన ప్ర‌భుత్వం పానీపూరి షాపులకు అనుమతి ఇవ్వ‌లేదు. చిరు వ్యాపారాలు చేసుకునే వారికి శుభ‌వార్త చెప్పిన ప్ర‌భుత్వం.. ఆయా షాపులు పాటించ‌వ‌ల‌సిన విధివిధానాల‌పై స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది.

  • పెద్ద షోరూమ్‌లకు వెళ్లాలంటే ముందే ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలి
  • అన్ని షాపుల్లో ట్రయల్ రూమ్‌లకు అనుమతి నిరాకరణ
  • ఆభ‌ర‌ణాల షాపుల్లో డిస్పోజ‌బుల్ గ్లౌజులు ఉండాలి
  • చెప్పుల దుకాణాలు, ఫ్రాంఛైజీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేయాలి
  • రోడ్లపై ఆహారం అమ్మేవారు ప్లేట్స్ లలో కాకుండా పార్సిల్ సదుపాయం క‌ల్పించాలి
  • అలాగే ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్న వారే ఆహార విక్రయ బండ్లను ఏర్పాటు చేసుకోవాలి
  • పానీపురి బండ్ల‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

ఇక ఏపీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 48 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2719 కేసులు న‌మోదు కాగా.. 57 మంది మృత్యువాత ప‌డ్డారు.

Next Story