న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 24 July 2020 9:54 AM GMTపీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ..!.. కేసీఆర్ వ్యూహం ఇదేనా..?
తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా స్థానాలను ఆశించే వారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు. 40 మంది ఉన్న మండలిలో.. గవర్నర్ కోటా కింద ఆరు స్థానాలు ఉంటాయి. ఇప్పటికే రెండు స్థానాలు ఖాళీ అయిపోయాయి. గతంలో గవర్నర్ కోటాలో మండలికి ఎన్నికైన రాములు నాయక్ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
పులులను వీటి కోసం కూడా వాడేస్తున్నారు.. షాకింగ్ విషయాలు బయటకు..
డెహ్రాడూన్: టైగర్ వైన్ కాస్ట్ ఎంతో తెలుసా..? 1000 డాలర్లు. టైగర్ కేక్ ను కూడా తయారు చేస్తున్నారు.. చాకొలేట్ బార్లను ఎలా అమ్ముతారో వీటిని కూడా అలాగే అమ్ముతూ ఉన్నారంటే చాలా మందికి తెలియదేమో..! ఒకప్పుడు వైద్య సంబంధిత అంశాల కోసం పులులను వేటాడి.. వాటి అవయవాలను బ్లాక్ మార్కెట్ కు తరలించే వారు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
వైసీపీలోకి గంటా శ్రీనివాస్..ముహూర్తం ఖరారైందా..?
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చారని పార్టీ ముఖ్యనేతల ద్వారా సమాచారం. ఎన్నికల ముందు నుంచే వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మర ప్రయత్నాలు చేసినా.. అది కుదరలేదని నేతలు చెబుతున్నారు. అయితే గంటా తరుచుగా నియోజకవర్గాలు మార్చే అలవాటు ఉంది. 2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి నార్త్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కేంద్రం కీలక నిర్ణయం: ఈ ఏడాది డిజిటల్ స్వాతంత్ర వేడుకలు
దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది స్వాతంత్ర వేడుకలకు డిజిటల్ హంగులు అద్దాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఎర్రకోట వద్ద ప్రధాని త్రివర్ణ పతాకాన్నిఎగరవేయడంతో పాటు అక్కడ నిర్వహించే గౌరవ వందనం,.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
వెనక్కి తగ్గని డ్రాగన్ దళాలు.. సరిహద్దులో భారత్ మిగ్-29కే ఫైటర్ జెట్ల మోహరింపు..!
భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఒక వైపు ప్రపంచం కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. మరో వైపు భారత్ - చైనా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కరోనా మహమ్మారిని అన్ని దేశాలకు వ్యాపించేలా చేసిన చైనా మాత్రం భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. సరిహద్దు ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. యుద్ధ వాతావరణం నెలకొనేలా కనిపిస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఐపీఎల్ కన్ఫర్మ్.. 51 రోజుల పాటూ మెగా ఈవెంట్..!
క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కు సంబంధించిన తేదీలు కూడా వచ్చేశాయి. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకూ ఐపీఎల్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించనున్నామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ శుక్రవారం నాడు మీడియాకు తెలిపారు. వచ్చే వారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుందని పలు అంశాలపై చర్చించనున్నామని బ్రిజేష్ పటేల్ వెల్లడించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
అత్యధిక సీసీటీవీల సర్వైలెన్స్‌లో ప్రపంచంలోనే టాప్-20లో చేరిన హైదరాబాద్
హైదరాబాద్: ప్రతి 1000 మంది జనాభాకు 30 మంది కెమెరాల నిఘా నీడలో ఉన్నారట. ప్రపంచంలోనే అత్యధిక సీసీటీవీల సర్వైలెన్స్ కలిగిన నగరాల్లో హైదరాబాద్ టాప్-20లో చోటు సంపాదించుకుంది. హైదరాబాద్ 16వ స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన నగరాలు కాకుండా టాప్-20లో చోటు సంపాదించుకున్న నగరాలు లండన్, హైదరాబాద్ మాత్రమేనని తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మీ సెల్ఫీ పిచ్చి పాడుగానూ..!
సెల్ఫీలు తీసుకోవాలి.. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయాలి.. లైక్ ల కోసం ఎదురుచూడాలి. ఇలా సెల్ఫీల పిచ్చిలో పడి ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లు కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు తమ సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. సమయానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వచ్చింది కానీ లేకపోతే వరద నీటిలో కొట్టుకుని వెళ్లే వాళ్ళే..! .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
భర్త వయసు 93, భార్య వయసు 89.. కరోనా వైరస్ ఏమీ చేయలేకపోయింది
వయసు పైబడిన వారిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే 55-60 వయసు పైబడిన వ్యక్తులు బయటకు రావద్దని కోరుతూ అధికారులు ప్రచారం చేస్తున్నారు. కేరళకు చెందిన వృద్ధ దంపతులు కరోనా వైరస్ ను జయించారు. అందుకు వైద్యుల కృషి మాత్రమే కారణం కాదు.. వారి ప్రేమ కూడా కారణమని అంటున్నారు. ఆసుపత్రిలో చోటుచేసుకున్న పరిణామాలే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
నేనే చంపేయాలని అనుకున్నా.. వికాస్ దుబే భార్య సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌లో మోస్ట్ వాంటెండ్ గ్యాంగ్‌స్టర్ వికాస్‌దుబే పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన విషయం తెలిసిందే. 8 మంది పోలీసులను చంపేసిన దుబేను పట్టుకుని కాన్పూర్‌కు వాహనంలో తీసుకెళ్తుండగా, వాహనం బోల్తా పడింది. దీంతో దుబే పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు కాల్చి చంపారు. అయితే తాజాగా వికాస్‌దుబే భార్య రిచా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది పోలీసులను చంపి ..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి