నేనే చంపేయాలని అనుకున్నా.. వికాస్‌ దుబే భార్య సంచలన వ్యాఖ్యలు

By సుభాష్  Published on  24 July 2020 9:21 AM GMT
నేనే చంపేయాలని అనుకున్నా.. వికాస్‌ దుబే భార్య సంచలన వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌లో మోస్ట్‌ వాంటెండ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దుబే పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన విషయం తెలిసిందే. 8 మంది పోలీసులను చంపేసిన దుబేను పట్టుకుని కాన్పూర్‌కు వాహనంలో తీసుకెళ్తుండగా, వాహనం బోల్తా పడింది. దీంతో దుబే పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు కాల్చి చంపారు. అయితే తాజాగా వికాస్‌దుబే భార్య రిచా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది పోలీసులను చంపి వారి కుటుంబాల్లో విషాదం నింపిన తన భర్తపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఆమె మీడియతో మాట్లాడుతూ..

నేను నా భర్తను చంపేద్దామనుకున్నా.. దుబే ఆకృత్యాలన్నీ నాకు తెలుసు.. పోలీసులను చంపి వారి కుటుంబాలను నాశనం చేశాడు. మేం సమాజంలో మా ముఖం చూపించుకోలేకపోతున్నాము. నేనే అతన్ని షూట్‌ చేసి చంపేసేదాన్ని. జూలై 3న అర్థరాత్రి 2 గంటలకు దుబే.. పిల్లల్ని తీసుకుని ఊరి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. పోలీసులు పట్టుకోవడానికి వస్తున్నారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే దుబేను తిట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోమని పంపించాను. ఆ తర్వాత పిల్లలతో కలిసి లక్నోలోని బంగ్లాలో తలదాచుకున్నాను.. అని వివరించారు.

చనిపోవడానికి ముందు దుబేకు యాక్సిడెంట్‌ అయ్యింది

వికాస్‌దుబే చనిపోవడానికి ముందు యాక్సిడెంట్‌ అయ్యింది. దీంతో అతనికి కోపం బాగా పెరిగింది. చనిపోవాడనికి కొన్ని రోజుల ముందు వైద్యం ఆపేశాడు. దుబే ఏం పని చేస్తున్నాడు.. ఎవరితో సంబంధాలున్నాయి అనే విషయాలన్నీ తెలిశాయి. నా బాధ అంతా పిల్లల గురించే. అంత్తింటివారు కానీ, పుట్టింటి వారు కానీ ఎవరు చూసుకోలేరు అంటూ రిచా ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story
Share it