దేశంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో వ్యాప్తిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది స్వాతంత్ర వేడుకలకు డిజిటల్‌ హంగులు అద్దాలని కేంద్ర సర్కార్‌ భావిస్తోంది. ఎర్రకోట వద్ద ప్రధాని త్రివర్ణ పతాకాన్నిఎగరవేయడంతో పాటు అక్కడ నిర్వహించే గౌరవ వందనం, ఇతక కార్యక్రమాలు, విన్యాసాలు, కవాతులు వంటి కార్యక్రమాలు వెబ్‌ క్యాస్టింగ్‌ విధానంలో ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతిసారి ఎర్రకోట వద్ద స్వాతంత్ర సంబరాలను వేలాది మంది వీక్షిస్తుంటారు. కరోనా నేపథ్యంలో అధిక సంఖ్యలో జనం ఒకచోట గుమిగూడటం సరైంది కాదని భావించి, ఈ ఏడాది నిర్వహించే వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కోల్పోనున్నారు. ఈ సంబరాలను దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా, సోషల్‌ మీడియాలో లైవ్‌ టెలికాస్ట్‌ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

అలాగే వేడుకల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. కోవిడ్‌ కారణంగా చేసే సంబరాలన్ని డిజిటల్‌, సోషల్‌ మీడియా ద్వారా ప్రసారం చేయాలని లేఖలో కేంద్రం సూచించింది.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet