తీరు మార్చుకోలేని డ్రాగన్‌ దళాలు.. సరిహద్దులో భారీగా మోహరింపు.!

By సుభాష్  Published on  24 July 2020 4:54 AM GMT
తీరు మార్చుకోలేని డ్రాగన్‌ దళాలు.. సరిహద్దులో భారీగా మోహరింపు.!

భారత్‌ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఒక వైపు ప్రపంచం కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. మరో వైపు భారత్‌ - చైనా సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కరోనా మహమ్మారిని అన్ని దేశాలకు వ్యాపించేలా చేసిన చైనా మాత్రం భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. సరిహద్దు ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. యుద్ధ వాతావరణం నెలకొనేలా కనిపిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన సైన్యాన్ని ఇప్పటి వరకు ఉపసంహరించుకోలేదు. భారత్‌ కూడా ఫైటర్‌ జెట్‌లను సైతం అక్కడికి తరలించింది. దీంతో సరిహద్దులో ఏ క్షణంలో ఏం జరుగుతుందో టెన్షన్ వాతావరణం నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇటీవల గాల్వన్‌ సరిహద్దులో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో తూర్పు లడఖ్‌ సెక్టరాలో ఇప్పటికే డ్రాగన్‌ దళాలు మోహరించి ఉన్నాయి. లడఖ్‌ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్‌ - చైనా సైనికాధికారుల మధ్య ఇటీవల జరిగిన ఒప్పందాన్ని డ్రాగన్‌ దేశం ఏ మాత్రం లెక్కచేయడం లేదు.

భారీగా చైనా దళాలు..

అయితే కమాండర్‌ స్థాయిలో జరిగిన చర్చల తర్వాత గల్వాన్‌ ప్రాంతాల నుంచి చైనా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గింది. కానీ ఆ ప్రాంతంలో ఇంకా భారీ స్థాయిలో తన దళాలను మోహరించి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంఖ్య దాదాపు 40వేలు ఉండవచ్చని ఆర్మీ వర్గాల ద్వారా సమాచారం. గత వారం రోజుల కిందట ఇరు దేశాల కమాండర్ల స్థాయి చర్చలు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ పర్యటన చేసిన సమయంలో పెద్దగా మార్పు కనిపించ లేదు. వెనక్కి వెళ్లేందుకు చైనా దళాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఘర్షణ జరిగిన ప్రాంతంలో గోగ్రా పోస్టు, హాట్‌ స్ప్రింగస్‌లో ఆ దేశం భారీ నిర్మాణాలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌ కూడా 40కిపైగా మిగ్‌-29కే ఫైటర్‌ జెట్‌లను సైతం సరిహద్దులో మోహరించింది.

రష్యాలో తయారైన ఈ ఫైటర్‌ జెట్‌లను భారత్‌ వైమానిక దళం గోవాం నుంచి తరలించింది. అంతేకాదు చైనానౌకాదళం కదలికలను గమనించేందుకు హిందూ మహాసముంద్రంలో భారత నౌకాదళం కూడా అప్రమత్తమైంది. కాగా, గత సో వామంర అమెరికా నౌకాదళంతో కలిసి భారత్‌ యుద్ధ నౌకలు హిందూ మహాసముద్రంలో విన్యాసాలు జరిపిన విషయం తెలిసిందే.

Next Story