న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 10 Sep 2020 10:26 AM GMT1.ఈఎంఐల మారటోరియంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోండి: సుప్రీం
బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారి ఈఎంఐలపై మారటోరియం విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ, బ్యాంకులకు రెండు వారాల గడువు ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపుపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2.మహేష్‌బాబు న్యూ లుక్.. అభిమానులు ఫిదా
కరోనా వైరస్ కారణంగా దాదాపు ఐదు నెలలుగా షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో నటీనటులు అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ప్రభుత్వాలు విడుదల చేస్తున్న మార్గదర్శకాలతో టీవీ, సినిమా, యాడ్ షూటింగ్స్‌లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ.. షూటింగ్‌లో పాల్గొంటున్నారు నటీనటులు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. భారత వైమానిక దళంలోకి చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు
భారత సరిహద్దులో చైనా సైన్యం కాలుదువ్వుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన 5 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు వాయుసేన అమ్ములపొదిలో చేరాయి. రాఫెల్ విమానాల చేరికతో భారత రక్షణశాఖ బలం మరింత పెరిగినట్టయింది. గురువారం అంబాలలోని వైమానిక స్థావరంలో రాఫెల్ యుద్ధ విమానాలకు భారత రక్షణశాఖ సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మన నేతలు ఎంతటి ఘనులో ..తెలుగు రాష్ట్రాల్లో 263 మందిపై కేసులా ?
మన ప్రజా ప్రతినిధుల్లో కొందరు ఎంతటి ఘనులో తాజాగా సుప్రింకోర్టు విచారణలో భాగంగా బయటపడింది. దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై ఎన్ని కేసులున్నాయి, వాటి తీవ్రత ఏమిటి అనే విషయంలో అమికస్ క్యూరి విజయ్ హన్సారియా సుప్రింకోర్టుకు వివరించారు. హన్సారియా అందించిన లెక్కల ప్రకారం దేశంమొత్తం మీద తాజా, మాజీ ప్రజా ప్రతినిధులపై 4442 మందిపై తీవ్రమైన కేసులున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. సుశాంత్ ఓ సమస్యాత్మక వ్యక్తి : అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్విటర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ అంతా కావాలనే పక్కన పెట్టిందంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు అనురాగ్ స్పందించారు. సుశాంత్ ఓ సమస్యాత్మక వ్యక్తి అని, అందుకే అతనితో పనిచేయలేదని అనురాగ్ కశ్యప్ బదులిచ్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. 17 నుంచి 24 వరకు బతుకమ్మ సంబురాలు
తెలంగాణలో ముఖ్యమైన పండగల్లో బతుకమ్మ ఒకటి. పువ్వులను పూజించడమే బతుకమ్మ పండగ విశిష్టత. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఆడ పడుచులందరూ కలిసి ఆడుకునే పండగ బతుకమ్మ. ప్రతి ఏడాది బతుకమ్మ పండగ వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడుచులు ఎక్కడున్న వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుంటారు. ఆనందోత్సహౄలతో పండగ జరుపుకొంటారు. తిరొక్క పూలతో రంగు రంగుల బతుకమ్మలను రోజుకో తీరుతో ఎంగిలిపూల బతుకమ్మ, అట్ల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ జరుపుకొంటారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఈ సారి ఐపీఎల్ టైటిల్ గెలిచేది సీఎస్‌కే నే
కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్ని అవాంతరాలు దాటుకుని మరో 9 రోజుల్లో మొదలు కానుంది. కరోనా కారణంగా ఈ సారి యూఏఈలో ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ సారి టైటిల్ ఎవరు గెలుస్తారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. 2019 సీజన్‌లో ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ నాలుగో సారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో చెన్నై కేవలం ఒక పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న చెన్నై ఆశలు ఆవిరి అయ్యాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. హమ్మయ్య.. వ్యాక్సిన్ ట్రయల్స్ లో భారత్ లో ఎటువంటి సమస్యలు రాలేదట..!
వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు త్వరలో మార్కెట్ లో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. మరోవైపేమో పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పై కూడా భారత్ ఆశలు పెట్టుకుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ చివరి దశ పరీక్షలను నిలిపివేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మూడు రాజధానుల పై కేంద్రం మరోసారి క్లారిటీ
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమంటూ ఇప్పటికే ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అపిడవిట్‌లో కేంద్రం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని కేంద్రం స్పష్టం చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. Fact Check : కంగనా రనౌత్ కు ఘన స్వాగతం పలుకుతామని రాజ్ థాక్రే ట్వీట్ చేశారా..?
కంగనా రనౌత్ కు, శివ సేనకు మధ్య గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే..! ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చిన కంగనా రనౌత్ వ్యాఖ్యలను శివసేన నేతలు తప్పుబట్టారు. ఆమెను ముంబైలోకి రానిచ్చే అవకాశమే లేదని అన్నారు. కానీ సెప్టెంబర్ 9న ముంబై లోకి కంగనా రనౌత్ అడుగుపెట్టింది. ఆమె వచ్చే సమయంలో కూడా హైడ్రామా నెలకొంది. ఆమె ఆఫీసును ముంబైలో కూల్చి వేయడం కూడా జరిగింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి