కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అన్ని అవాంతరాలు దాటుకుని మరో 9 రోజుల్లో మొదలు కానుంది. కరోనా కారణంగా ఈ సారి యూఏఈలో ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. కాగా.. ఈ సారి టైటిల్‌ ఎవరు గెలుస్తారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

2019 సీజన్‌లో ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్‌ నాలుగో సారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో చెన్నై కేవలం ఒక పరుగు తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న చెన్నై ఆశలు ఆవిరి అయ్యాయి.
కాగా.. ఈ సీజన్‌లో ఖచ్చితంగా సీఎస్‌కే టైటిల్‌ను గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అభిప్రాయ పడ్డాడు.

ఐపీఎల్‌ కవరేజ్‌లో భాగంగా బ్రాడ్‌కాస్టర్స్‌ హోస్ట్‌గా చేయనున్న బ్రెట్‌ లీ.. ప్రస్తుతం ముంబై చేరుకుని ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ సందర్భంగా అభిమానులతో చిట్‌చాట్‌ చేశాడు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు. ఓ అభిమాని ఈ సీజన్‌లో ఎవరు ఐపీఎల్‌ విజేతగా నిలుస్తారని అడిగాడు. ఎవరు గెలుస్తారో చెప్పడం కొంచెం కష్టమేనని తెలిపాడు. సీఎస్‌కే నే టైటిల్‌ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నాడు. ఇక కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఈ సారి ఫైనల్‌-4లో ఉంటుందన్నాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *