రిషబ్‌పంత్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు.. వీడియో వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2020 10:01 AM GMT
రిషబ్‌పంత్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు.. వీడియో వైరల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్‌) లో సత్తా చాటి టీమ్‌ఇండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని యంగ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్ బావిస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన ఐపీఎల్‌ లో పంత్ రాణించేందుకు తీవ్రంగా సాధన చేస్తున్నాడు. గతేడాదిలో చివరి సారిగా భారత జట్టు తరుపున పంత్‌ ఆడాడు. అప్పుడు గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు పంత్‌ దూరంకాగా.. అతడి స్థానంలో వచ్చిన కేఎల్‌ రాహుల్‌.. అటు బ్యాటింగ్‌ ఇటు కీపింగ్‌లో రాణించడంతో.. పంత్‌ స్థానానికి ఎసరు పడింది. దీంతో టీమ్‌ఇండియాలో పంత్‌ చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌ అంటే చెలరేగి పోయే ఈ లెఫ్ట్‌హ్యాండ్ ఆటగాడు ఈ సారి కూడా జట్టుకు విజయాలు అందించాలని కోరుకుంటున్నాడు. ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలెట్టిన పంత్‌.. బ్యాటింగ్‌లో మునుపటి ఫామ్‌ను అందుకునేందుకు తీవ్రంగా సాధన చేస్తున్నాడు.ఇక ప్రాక్టీస్‌ సెషన్‌లో స్పినర్ల బౌలింగ్‌లో‌ బౌలింగ్‌లో వరుసగా మూడు భారీ సిక్సర్లు బాదాడు. తొలి బంతిని లాంగాన్‌ సిక్స్‌ కొట్టిన పంత్‌.. రెండో బంతిని డీప్‌ ఫైన్‌లెగ్‌ మీదుగా సిక్స్‌ బాదేశాడు. ఇక మూడో బంతిని లాంగాఫ్‌ వైపు బౌండరీ దాటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటీజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మళ్లీ జాతీయ జట్టులోకి వస్తావు పంత్.. అక్కడ కూడా ఇలాగే నీ విధ్వంసం కొనసాగించూ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. పంత్‌ కొట్టిన సిక్సర్లకు 1998లో కోకాకోలా కప్‌ ఫైనల్‌లో భాగంగా జిం‍బాబ్వేపై భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వరుసగా కొట్టిన మూడు సిక్సర్లను ఒక అభిమాని జత చేశాడు.ఐపీఎల్‌లో పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షార్జాలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ప్రాక్టీస్‌ చేస్తోంది. సెప్టెంబర్‌ 20వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ తొలి మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో తలపడనుంది.

Next Story