రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్సర్.. స్టేడియం బయట వెళుతున్న బస్ పై..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Sep 2020 12:07 PM GMT
రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్సర్.. స్టేడియం బయట వెళుతున్న బస్ పై..!

ఐపీఎల్ మరో పది రోజుల్లో మొదలవుతూ ఉండడంతో ఫ్రాంఛైజీలు దుబాయ్ లో ప్రాక్టీస్ ను మొదలుపెట్టాయి. తమ జట్ల ఆటగాళ్లు ప్రాక్ట్టీస్ చేస్తున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు.

ముంబై ఇండియన్స్ జట్టు అబుదాబీ బీచ్ లో ఎంజాయ్ చేయడం పూర్తీ చేశాక.. తిరిగి ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ జట్టును లీడ్ చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ అప్లోడ్ చేసిన వీడియోలో రోహిత్ శర్మ ఫ్లడ్ లైట్స్ వెలుగులో ప్రాక్టీస్ చేయడాన్ని చూడొచ్చు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పిన్ బౌలింగ్ కు ప్రాక్టీస్ చేస్తూ ఓ భారీ సిక్సర్ ను బాదాడు.

ఆ బంతి ప్రాక్టీస్ ఏరియాను దాటి రోడ్డు మీద వెళుతున్న బస్సు మీద పడింది. ఆ వీడియోలో 'బస్సు అద్దం పగులగొట్టావా లేదా' అని రోహిత్ శర్మను అక్కడ ఉన్న వాళ్లు అడిగారు. ఆ సిక్సర్ దాదాపు 95 మీటర్లు వెళ్లిందని వీడియోలో చూపించారు. భారీ సిక్సర్ ను కొట్టగానే రోహిత్ శర్మ గాలిలోకి చేతులు ఎత్తి అభివాదం తెలిపాడు.ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో భారీగా స్పందన వస్తోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ నాలుగు ఐపీఎల్ టైటిల్స్ ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్ టైటిల్ ను నిలబెట్టుకునే ప్రయత్నాలను మొదలుపెట్టనుంది. ఐపీఎల్ 2020లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్.. మూడు సార్లు టైటిల్ విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.

ఐపీఎల్ లో ఆడ‌డానికి యూఏఈ చేరుకున్న ముంబయి ఇండియన్స్ సభ్యులు అక్క‌డి బీచ్ లో ఎంజాయ్ చేశారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అక్క‌డి బీచ్ లో భార్యాపిల్ల‌ల‌తో ఎంజాయ్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ముంబై ఇండియ‌న్స్ ఇత‌ర ఆట‌గాళ్లు కూడా బీచ్ లో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ముంబయి ఇండియన్స్ త‌మ అధికారిక‌ ఖాతాల్లో పోస్ట్ చేసింది.

Next Story