హమ్మయ్య.. వ్యాక్సిన్ ట్రయల్స్ లో భారత్ లో ఎటువంటి సమస్యలు రాలేదట..!

By సుభాష్  Published on  10 Sep 2020 1:45 AM GMT
హమ్మయ్య.. వ్యాక్సిన్ ట్రయల్స్ లో భారత్ లో ఎటువంటి సమస్యలు రాలేదట..!

వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు త్వరలో మార్కెట్ లో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. మరోవైపేమో పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పై కూడా భారత్ ఆశలు పెట్టుకుంది. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ భాగ‌స్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనె‌కా కరోనా వ్యాక్సిన్ చివ‌రి ద‌శ పరీక్షలను నిలిపివేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్రయ‌ల్స్‌ వివిధ దేశాల్లో కొనసాగుతూ ఉంది. బ్రిట‌న్‌లో ఈ టీకా తీసు‌కున్న వ‌లంటీర్లకు ఆరోగ్య స‌మ‌స్యలు త‌లెత్తడంతో తుది ద‌శ ట్రయ‌ల్స్‌ను ప్ర‌స్తుతానికి నిలిపివేస్తున్న‌ట్లు ఆస్ట్రాజెనెకా అధికారికంగా ప్ర‌క‌టించింది. అసలే వ్యాక్సిన్ రేసులో ఆస్ట్రాజెనెకా ముందు ఉంది అని ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి వార్త చాలా మందిలో నిరాశ నింపింది. ప్ర‌యోగ ప్రామాణిక ప్ర‌క్రియ‌, వ్యాక్సిన్ భ‌ద్ర‌త‌పై పూర్తిస్థాయి స‌మీక్ష నిర్వహిస్తూ ఉండడంతో ఆస్ట్రాజెనెకా ప్రస్తుతం కొద్దిరోజుల పాటూ ప్రయోగాన్ని వాయిదా వేసిందని తెలుస్తోంది.

Advertisement

కరోనా వైరస్ ఆస్ట్రాజెనెకా టీకా పరీక్షలకు సంబంధించి యూకేలో ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు వచ్చిన నివేదికలపై వ్యాఖ్యానించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిరాకరించినప్పటికీ.. భారత్ లో మాత్రం క్లినికల్ ట్రయల్స్ ను ఆపలేదని స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయిల్స్ భారత్‌లో నిలిపి వేయలేదని.. పరీక్షలు కొనసాగుతున్నాయనీ ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని సీరం స్పష్టం చేసింది. భారత్ లో ట్రయల్స్ కు ఎటువంటి ఆటంకాలు లేవని స్పష్టం చేసింది.

Next Story
Share it