వికటించిన ఆక్స్‌ఫర్డ్‌ కరోనా టీకా.. తాత్కాలికంగా ట్రయల్స్‌ నిలిపివేత

By సుభాష్  Published on  9 Sep 2020 4:02 AM GMT
వికటించిన ఆక్స్‌ఫర్డ్‌ కరోనా టీకా.. తాత్కాలికంగా ట్రయల్స్‌ నిలిపివేత

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచ దేశాలు ఎంతో కృషి చేస్తున్నారు. కొన్ని కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కూడా నిర్వహిస్తున్నాయి. అయితే కోవిడ్‌ వ్యాక్సిన్‌ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనిపై మంగళవారం ఆస్టాజెనెకా ఓ ప్రకటన విడుదల చేసింది. మూడో దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ వికటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్‌ వికటించి బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి సైడ్‌ ఎఫెక్ట్స్‌ తో ఇబ్బందులు పడుతుండటంతో మూడో దశ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఆక్స్‌ఫర్డ్‌, ఆస్టాజెనెకా కలిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, బ్రెజిల్‌, సౌతాఫ్రికాలో ఈ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. తుది దశలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ మూడో దశలో దుష్ఫలితాలు రావడంతో ఒక్కసారిగా ట్రయల్స్‌ను నిలిపివేశారు. త్వరలో మార్కెట్లోకి వస్తున్న భావించిన ఆక్సఫర్డ్‌..ఆశలు అడియాశలయ్యాయి.

కాగా, అమెరికా వ్యాప్తంగా దాదాపు 80 నగరాల్లో వివిధ ప్రయోగ కేంద్రాల్లో 30వేలకుపైగా వాలంటీర్లను నమోదు చేసుకున్నారు. వీరంతా 18 ఏళ్లకు పైబడినవారే. వివిధ సంస్కృతులు, జాతులు, భౌగోళిక ప్రాంతాలకు చెందిన వారు వీరిలో ఉన్నారు. హెచ్‌ఐవీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story