న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  20 July 2020 1:52 PM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

షాకింగ్‌.. ఏపీలో కొత్తగా 4074 కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ కొరలు చాస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన 24 గంటల్లో 4074 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 54 మంది మృతి చెందారు. ఇప్పటి వరకే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50,829 నమోదు కాగా, 28,469 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సీఎం కేసీఆర్‌కు నితిన్ పెళ్లి ఆహ్వానం.!

టాలీవుడ్ యువ‌ హీరో నితిన్ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ నెల‌ 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నాడు. ఈ మేర‌కు ఇప్పటికే అధికారిక సమాచారాన్ని విడుదల చేయ‌గా.. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గవర్నర్‌ను కలిసిన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌

ఏపీలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారం హాట్‌ టాపిగా మారింది. నిమ్మగడ్డ తిరిగి నియమాకానికి సంబంధించి కోర్టులో జరిగిన వ్యవహారం తెలిసిందే. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ .. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు డేట్ ఫిక్స్‌

ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనే అంశంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చర్చలకు తెర దించుతూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌ నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్‌.. గవర్నర్‌తో భేటీ అయ్యారు. సచివాలయ కూల్చివేత, కొత్త సచివాలయ నిర్మాణం, కరోనా నివారణ చర్యలపై కేసీఆర్‌ చర్చించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రోగులకు అందుతున్న చికిత్స విధానంపై గవర్నర్‌కు వివరించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Fact Check : ఈ అద్భుతమైన కట్టడాన్ని రాజరాజ చోళుడు కట్టించాడా..?

భారతదేశంలో ఎన్నో అపురూపమైన కట్టడాలు ఉన్నాయి. ఒక్కో రాజు ఒక్కో తరహా కట్టడాలను భారతదేశంలో కట్టించారు. అసలు టెక్నాలజీ అన్నదే లేని సమయంలో ఎంతో గొప్ప కట్టడాలు ఎలా నిర్మించారా అని కూడా ఇప్పటి తరం ఆశ్చర్యపోతూ ఉంటుంది. ‘రాజరాజ చోళుడు తన భార్య కోసం అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడు..? తమిళుల ప్రతిభకు ఇదొక నిదర్శనం’ అని తాజాగా తమిళంలో ఓ పోస్టు వైరల్ అవుతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం.. రామ మందిర నిర్మాణానికి విరాళం

ఏపీలోని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి తనవంతు మూడు నెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.3,96000 చెక్కును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుకు రాసినట్లు ట్వీట్‌ చేశారు. ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోస్టు మార్టంలో ఏముందంటే..!

ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే బుల్లెట్‌ గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో షాక్‌కు గురై మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కాగా, జూలై 10న ఉజ్జయిని నుంచి వికాస్‌దూబేను కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో వాహనం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రైవేటు రైళ్లను నడిపేందుకు కసరత్తు..!

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేటు రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు రూట్లలో ప్రైవేటు రైళ్లను నడిపే బాధ్యత ఐఆర్‌సీటీసీకి అప్పగించింది. అయితే ఆ ప్రయోగం విజయవంతం కావడంతో మరో 151 ప్రైవేటు రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు తయారు చేసోతోంది. దశలవారీగా ఈ ప్రైవేటు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మహారాష్ట్ర నుండి కేరళ చేరుకోడానికి ఆ ట్రక్కుకు సంవత్సరం పట్టింది.. ఇంతకూ ఏమి మోసుకుని వెళ్తోందంటే..!

తిరువనంతపురం: మాహారాష్ట్ర నుండి కేరళకు వెళ్ళడానికి ఆ ట్రక్కుకు సంవత్సరం పైగా సమయం పట్టింది. ఇంతకూ ఆ ట్రక్కు మోసుకుని వెళ్లిన వస్తువులు ఏమిటనే కదా మీ డౌట్..? ఆ ట్రక్కులో ‘స్పేస్ రీసర్చ్ ప్రాజెక్ట్’ కు సంబంధించిన ఎంతో ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. తిరువనంతపురం లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వి.ఎస్.ఎస్.సి.) దగ్గరకు ఆదివారం నాడు చేరుకుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story