సీఎం కేసీఆర్‌కు నితిన్ పెళ్లి ఆహ్వానం.!

By Medi Samrat  Published on  20 July 2020 1:22 PM GMT
సీఎం కేసీఆర్‌కు నితిన్ పెళ్లి ఆహ్వానం.!

టాలీవుడ్ యువ‌ హీరో నితిన్ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ నెల‌ 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నాడు. ఈ మేర‌కు ఇప్పటికే అధికారిక సమాచారాన్ని విడుదల చేయ‌గా.. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వివాహ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు.

అయితే.. నితిన్‌ తన వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఆహ్వాన ప‌త్రికను అందించి.. సీఎం కేసీఆర్‌ను వివాహానికి ఆహ్వానించారు. ఇక ఈ వివాహానికి కేవ‌లం ఇరు కుటుంబాల వారు, ద‌గ్గ‌రి స్నేహితులు మాత్రమే హాజ‌రుకానున్నారు.

ఇదిలావుంటే.. నితిన్, షాలినిల పెళ్లిని ఇరు కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా జరపాలని అనుకున్నారు. క‌రోనా వ్యాప్తి నేఫ‌థ్యంలో వీరి పెళ్లి మాములుగానే జరగబోతోంది. ఇక నితిన్ ప్ర‌స్తుతం రంగ్ దే, చెక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల త‌ర్వాత‌ మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంధాధున్’ రీమేక్‌, కృష్ణ‌చైత‌న్య డైర‌క్ష‌న్‌లో ‘ప‌వ‌ర్ పేట’ సినిమాలు చేయ‌నున్నాడు.

Next Story