ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం.. రామ మందిర నిర్మాణానికి విరాళం

By సుభాష్  Published on  20 July 2020 10:46 AM GMT
ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం.. రామ మందిర నిర్మాణానికి విరాళం

ఏపీలోని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి తనవంతు మూడు నెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.3,96000 చెక్కును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుకు రాసినట్లు ట్వీట్‌ చేశారు. ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. రామాలయ నిర్మాణానికి ఇది తాను చేస్తున్న ఉడుత సాయమని పేర్కొన్నారు. అయితే ట్వీట్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షాలకు రఘురామకృష్ణంరాజు ట్యాంగ్‌ చేయడం గమనార్హం. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు రామ మందిర నిర్మాణం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కాగా, రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ భూమి పూజ చేయనున్నారు. అయోధ్యలోని సుమారు 67 ఎకరాల విస్తీర్ణంలోరామ మందిరం నిర్మాణం కానుంది. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయం కానుంది. కొత్తగా నిర్మించబోయే మందిరం ఎత్తు 128 అడుగులు. వెడల్పు 140 అడుగులు. పొడవు270 అడుగుటు ఉంటుందని తెలుస్తోంది. రామాలయాన్ని రెండంతస్తుల్లో నిర్మాణం చేపట్టాలా ప్లాన్‌ సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తులోనే శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయ పైభాగాన శిఖం ఉంటుంది. ఒక్కో అంతస్తులో 106 స్తంభాల చొప్పున మొత్తం 212 స్తంభాలు ఉంటాయి.Next Story
Share it