గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

By సుభాష్  Published on  20 July 2020 11:31 AM GMT
గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌ నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్‌.. గవర్నర్‌తో భేటీ అయ్యారు. సచివాలయ కూల్చివేత, కొత్త సచివాలయ నిర్మాణం, కరోనా నివారణ చర్యలపై కేసీఆర్‌ చర్చించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రోగులకు అందుతున్న చికిత్స విధానంపై గవర్నర్‌కు వివరించారు. అయితే కరోనా పరీక్షలు, చికిత్సపై హైకోర్టు పదే పదే మొట్టికాయ వేయడం, విపక్షాల విమర్శల నేపథ్యంలో కేసీఆర్‌ గవర్నర్‌కు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు గవర్నర్‌ కోట ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ విషయమై కూడా కేసీఆర్‌ చర్చించనట్లు తెలుస్తోంది.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 45వేలు దాటింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 45075 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 32,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,65,219 శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించగా, గడిచిన 24 గంటల్లో 12,519 శాంపిళ్లను పరీక్షించారు.

Next Story
Share it