షాకింగ్‌.. ఏపీలో కొత్తగా 4074 కరోనా కేసులు

By సుభాష్  Published on  20 July 2020 1:26 PM GMT
షాకింగ్‌.. ఏపీలో కొత్తగా 4074 కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ కొరలు చాస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన 24 గంటల్లో 4074 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 54 మంది మృతి చెందారు. ఇప్పటి వరకే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50,829 నమోదు కాగా, 28,469 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు 21,664 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 696కి చేరింది. ఇక తాజాగా 1335 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

తాజాగా ఏ జిల్లాల్లో ఎంత మంది మృతి చెందారు..

గడిచిన 24 గంటల్లో 54 మంది మృతి చెందగా, అందులో తూర్పుగోదావరి జిల్లాలో 9, గుంటూరు 9, కృష్ణ 7, అనంతపురం 6, చిత్తూరు 5, శ్రీకాకుళం 5, విశాఖ 5, కర్నూలు 3, పశ్చిమగోదావరి 3, కడప 1, విజయనగరం జిల్లాలో 1 చొప్పున మృతి చెందారు.

తాజాగా ఏ జిల్లాల్లో ఎన్ని కేసులు

అనంతపురం - 342

చిత్తూరు - 116

ఈస్ట్‌ గోదావరి - 1086

గుంటూరు - 596

కడప - 152

కృష్ణ - 129

కర్నూలు - 559

నెల్లూరు - 100

ప్రకాశం - 221

శ్రీకాకుళం - 261

విశాఖ - 102

విజయనగరం - 56

వెస్ట్‌ గోదావరి - 354Next Story
Share it