మహారాష్ట్ర నుండి కేరళ చేరుకోడానికి ఆ ట్రక్కుకు సంవత్సరం పట్టింది.. ఇంతకూ ఏమి మోసుకుని వెళ్తోందంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2020 8:24 AM GMT
మహారాష్ట్ర నుండి కేరళ చేరుకోడానికి ఆ ట్రక్కుకు సంవత్సరం పట్టింది.. ఇంతకూ ఏమి మోసుకుని వెళ్తోందంటే..!

తిరువనంతపురం: మాహారాష్ట్ర నుండి కేరళకు వెళ్ళడానికి ఆ ట్రక్కుకు సంవత్సరం పైగా సమయం పట్టింది. ఇంతకూ ఆ ట్రక్కు మోసుకుని వెళ్లిన వస్తువులు ఏమిటనే కదా మీ డౌట్..? ఆ ట్రక్కులో 'స్పేస్ రీసర్చ్ ప్రాజెక్ట్' కు సంబంధించిన ఎంతో ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. తిరువనంతపురం లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వి.ఎస్.ఎస్.సి.) దగ్గరకు ఆదివారం నాడు చేరుకుంది.

జులై 8, 2019న మహారాష్ట్ర నుండి ఈ భారీ ట్రక్కు బయలుదేరింది. నాలుగు రాష్ట్రాలను దాటుకుని తిరువనంతపురంకు ఆదివారం నాడు చేరుకుంది. ఏరోస్పేస్ హారిజాంటల్ ఆటోక్లేవ్ ను ఆ ట్రక్కు మోసుకుని వెళ్ళింది. వెయిట్ లెస్ మెటీరియల్ ను తయారుచేయడానికి దాన్ని ఉపయోగిస్తారు. రోజుకు ఈ ట్రక్కు ప్రయాణించింది కేవలం అయిదు కిలోమీటర్లు మాత్రమే కావడంతో ఇంత సమయం పట్టిందని తెలుస్తోంది. మొత్తం 32 మంది సిబ్బంది ఈ ప్రయాణంలో పాలుపంచుకున్నారు.

ఆ ట్రక్కు మోసుకుని వెళుతున్న మెషీన్ బరువు 70 టన్నులు కాగా.. పొడవు 7.5 మీటర్లు.. వెడల్పు 6.65 మీటర్లు. నాసిక్ లో తయారు చేసిన పరికరాన్ని ఇండియన్ స్పేస్ రీసర్చ్ ప్రాజెక్ట్ కోసం వినియోగించారు. భారీ వాహనంలో తరలివెళుతూ ఉంటే ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉండేవారు. మధ్య మధ్యల్లో అనుకోని అవాంతరాలు ఎదురైనా చాలా జాగ్రత్తగా తిరువనంతపురంకు తీసుకుని వెళ్లారు.

Next Story