ఏపీలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారం హాట్‌ టాపిగా మారింది. నిమ్మగడ్డ తిరిగి నియమాకానికి సంబంధించి కోర్టులో జరిగిన వ్యవహారం తెలిసిందే. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ .. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు.

హైకోర్టు తీర్పును గవర్నర్‌కు విన్నవించి వినతి పత్రం అందించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై మూడుసార్లు సుప్రీం కోర్టు స్టే నిరాకరించినా.. ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీగా రమేష్‌ కుమార్‌ను నియమించకపోవడంపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేయాలని నిమ్మగడ్డకు ఏపీ హైకోర్టు సూచించింది. ఈ మేరకు గవర్నర్‌ను కలిశారు.

ఇదిలా ఉండగా, నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంపై ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగా,కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపడం సరికాదని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ‌హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తే సుప్రీం కోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్‌ నిరర్ధకం అవుతుందని ఏపీ సర్కార్‌ పిటిషన్‌లో పేర్కొంది. ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ముందుకెళ్లడం సరైంది కాదని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.

సుభాష్

.

Next Story