తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు 160 CRPC కింద నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లోని ఆయన ఇంటికి నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. కాగా రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ 7 గంటల పాటు విచారించింది.