న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  16 Oct 2020 9:22 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1.రూ.75 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 నాణేన్ని విడుదల చేశారు ప్రధాని నరేంద్రమోదీ. దేశంలో పోషకాహార లోపం సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ పంటల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.Fact Check : అత్యాచారాలు భారతదేశ సంస్కృతిలో ఒక భాగమేనని బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ అన్నారా..?

కిరణ్ ఖేర్.. నటిగా బాలీవుడ్ లో ఎన్నో గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేశారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే ఓ స్టేట్మెంట్ ఆమె ఇచ్చినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.బీజేపీ చండీఘడ్ ఎంపీ కిరణ్ ఖేర్ ఫోటోతో ఉన్న పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆమె ‘అత్యాచారాలు మా సంస్కృతిలో భాగం.. వాటిని ఆపలేము’ అని హిందీ టెక్స్ట్ లో ఉంది. ఫేస్ బుక్ యూజర్లు ఈ ఫోటోను పోస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విష్ణు కోసం రంగంలోకి విక్ట‌రీ వెంక‌టేష్‌

టాలీవుడ్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్‌ మోహ‌న్‌బాబు త‌న‌యుడు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా ‘మోసగాళ్లు’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఓ పెద్ద‌ ఐటీ స్కా్‌మ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తుంది. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 19 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు..!

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రమైన దెబ్బకొట్టింది. కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇక కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించగా, అన్ని రంగాలతో పాటు విద్యాసంస్థలు మూత పడ్డాయి. ఇక అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా దాదాపు అన్ని సంస్థలు తెరుచుకున్నా.. విద్యా సంస్థలు మాత్రం ఇంకా తెరుచుకోవడం లేదు. ఇక తాజాగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను పునః ప్రారంభించాలని పంజాబ్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌ రాష్ట్రంలో ఈనెల 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ ఇందర్‌ సింగ్‌ తెలిపారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం

విజ‌య‌వాడ‌ నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు నిర్మించిన‌ కనకదుర్గ ఫ్లైఓవర్ ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం వైఎస్‌ జగన్‌ లు శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కొత్త‌గా రూ. 7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. అలాగే.. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు జాతికి అంకితం ఇచ్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమం..!

తెలంగాణ మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్‌ 28న ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చేరి 16 రోజుల పాటు చికిత్స పొందారు. వారం రోజుల కిందట కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్‌ వచ్చింది. త్వరలో ఆయన కోలుకుని ఇంటికి వస్తారని అనుకున్న సమయంలోనే ఊపిరి తీసుకోవడం ఇబ్బందులు తలెత్తాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వ‌ర‌ద‌ల్లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ఆర్థిక సహాయం

భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం

అక్కనేని కుటుంబానికి చెందిన ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు భారీగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విజయవాడ: దివ్య హత్య కేసులో మరో ట్విస్ట్‌

విజయవాడలో దివ్య హత్య కేసు సంచలనం రేపుతోంది. మరో వైపు ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు నాగేంద్రబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాగేంద్రబాబు ఇంకా స్పృహలోకి రాలేదని వైద్యులు చెబుతున్నారు. 48 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. కత్తితో పొడుచుకోవడంతో నాగేంద్రబాబు కడుపులో తీవ్ర గాయాలయ్యాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 20 నుంచి ప్రత్యేక రైళ్లు

రైల్వేశాఖ ప్రయాణికులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దసరా, దీపావళి పండగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే జోన్లవారీగా 392 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story