అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం

By సుభాష్  Published on  16 Oct 2020 4:26 AM GMT
అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం

అక్కనేని కుటుంబానికి చెందిన ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు భారీగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టూడియో యాజమాన్యం తెలిపింది. మూవీ షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని తెలుస్తోంది.

కాగా, అన్నపూర్ణ సెవన్‌ ఎక్కర్స్‌లో ఈ ప్రమాదం జరుగగా, అందులో బిగ్‌బాస్‌ షూటింగ్‌ జరుగుతుండటంతో కొంత ఆందోళన నెలకొంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న కుడివైపు బిగ్‌బాస్‌ హౌస్‌ ఉంది. అయితే మంటలు అదుపులోకి రావడంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

కాగా, సినీ నటుడు, కింగ్‌ నాగార్జున ప్రస్తుతం ఈ అన్నపూర్ణ స్టూడియోకు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఈ స్టూడియోలో సినిమాలతో పాటు పలు సీరియల్స్‌, రియాలిటీ షోలు, టీవీ ప్రోగ్రామ్‌లు తదితర షూటింగ్‌లు ఇక్కడే జరుగుతుంటాయి. దివంగత మహానటుడు ఈ స్టూడియోను నిర్మించారు. ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలను నిర్మించిన ఈ స్టూడియోగా అన్నపూర్ణ స్టూడియోకు ఎంతో పేరుంది.

Next Story
Share it