నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమం..!

By సుభాష్  Published on  16 Oct 2020 6:32 AM GMT
నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమం..!

తెలంగాణ మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్‌ 28న ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చేరి 16 రోజుల పాటు చికిత్స పొందారు. వారం రోజుల కిందట కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్‌ వచ్చింది. త్వరలో ఆయన కోలుకుని ఇంటికి వస్తారని అనుకున్న సమయంలోనే ఊపిరి తీసుకోవడం ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా, ఊపిరి తిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయి న్యుమోనియా సోకిందని వైద్యులు నిర్ధారించారు. అంతేకాకుండా నాయినికి ఆక్సిజన్‌ లేవల్స్‌ సైతం పడిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్‌ రవి ఆండ్రూస్‌, మరో డాక్టర్‌ కెవి. సుబ్బారెడ్ఇడ పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, నాయిని నర్సింహారెడ్డి భార్యకు కూడా కరోనా సోకింది. ఆమెను కూడా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగిటివ్‌ వచ్చినప్పటికీ మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అలాగే నాయిని అల్లుడు, రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు.

Next Story